Mohammad Irfan About Virat Kohli from their 2024 T20 World Cup squad: టీమిండియా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ మ‌జా నుంచి క్రికెట్ అభిమానులు టీ-20 మ‌జాకు వచ్చేశారు . ఇక అభిమానుల‌కు అస‌లైన విందు అందించే ఇండియ‌న్ ప్రీమియ‌ర్‌లీగ్ (IPL 2024) మార్చి 22 న ఆరంభం కాబోతోంది. ఆ త‌ర్వాత టీ-20 ప్రపంచ‌క‌ప్ జూన్‌లోనే మొద‌ల‌వ‌బోతోంది. దీంతో బీసీసీఐ కూడా తుది ఆట‌గాళ్ల ఎంపిక‌పై దాదాపు ఓ నిర్ణయానికి వ‌చ్చేసింది. బీసీసీఐ కార్యదర్శి జై షా మాత్రం రోహిత్ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే వెల్లడించాడు.  అయితే అంద‌ర్నీ ఆశ్చ్యర్య ప‌రిచేలా టీ-20 ప్రపంచ‌క‌ప్‌న‌కు టీంఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ని ఎంపిక చేయ‌ట్లేద‌న్న వార్త కలకలం రేపుతోంది. విరాట్‌కోహ్లీ... టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో విజ‌యాల‌తీరానికి చేర్చిన మొన‌గాడు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టాలన్న కొందరి వాదనపై పాక్‌ క్రికెటర్‌ మండిపడ్డాడు.



పాక్ క్రికెటర్‌ ఏమన్నాడంటే..? 
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఇర్పాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్‌ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్‌ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్‌ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వ‌ర‌ల్డ్‌క‌ప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అంద‌రికి గుర్తే. 765 ప‌రుగులు సాధించి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్ గా రికార్డ్ సాధించాడు. దాద‌పు 95 యావ‌రేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కాడు. 


అభిమానుల ఆగ్రహం
అయితే, 2024 టీ20 ప్రపంచ‌కప్‌న‌కు కోహ్లిని ఎంపిక చేయకపోవచ్చే ప్రచారం జ‌రుగుతున్న నేపథ్యంలో విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. టీ20 ల‌కు మాత్ర‌మే కాదు, క్రికెట్ లో కోహ్లీ రికార్డుల‌ను గుర్తుచేస్తున్నారు. గ‌తంలో గెలిపించిన మ్యాచ్‌ల‌ను  గుర్తు చేస్తున్నారు. బీసీసిఐ ఈ ఆలోచ‌న‌ను త‌క్ష‌ణం విర‌మించుకోవాల‌నే కింగ్ కోహ్లీ జ‌ట్లులో ఉండాల్సిందే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
ఏది ఏమైనా ఈ సారి ఐపీయ‌ల్ ని బీసీసిఐ కూడా చాలాసీరియ‌స్ గా తీసుకొనే అవ‌కాశ‌మే ఉంది. మే మొద‌టి వారంలో జట్టు ఆట‌గాళ్ల వివరాలను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఈలోగా బీసీసిఐ ఏ నిర్ణ‌యం తీసుకొంటుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.