2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలతో భారత జట్టు, క్రికెట్ అభిమానులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది టీమ్ ఇండియా వైట్ బాల్ ఫార్మాట్‌లో పలు గొప్ప విజయాలు సాధించింది. కానీ టెస్ట్ ఫార్మాట్‌లో ప్రదర్శన అంతగా బాగోలేదు. ఈ ఏడాదే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2025లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఇక్కడ చూడండి.

Continues below advertisement

టెస్టుల్లో ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది

2025లో భారత జట్టు మొత్తం 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 4 విజయాలు, 5 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది, అయితే టీమ్ ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2024- 25 చివరి టెస్ట్ ఈ ఏడాదే జరిగింది. అందులో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత భారత జట్టు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లింది. యువకులతో కూడిన జట్టు అక్కడ కీలకమైన 5 మ్యాచ్‌ల సిరీస్ 2-2తో డ్రా చేసుకుంది. భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో ఓడించింది. కానీ ఆ తర్వాత మన గడ్డ మీదే దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయింది.

  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్: భారత్ 6 వికెట్లతో ఓటమి
  • భారత్ వర్సెస్ ఇంగ్లాండ్: సిరీస్ 2- 2తో డ్రా
  • భారత్ వర్సెస్ వెస్టిండీస్: భారత్ 2-0తో గెలుపు
  • భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా: భారత్ 0-2తో ఓటమి

వన్డేల్లో అద్భుత ప్రదర్శన, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు

ఈ ఏడాది ODI క్రికెట్‌లో భారత్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. భారత్ ఈ ఏడాది 14 వన్డే మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 11 విజయాలు సాధించగా, కేవలం మూడు మ్యాచులు ఓడిపోయింది. ఈ ఏడాదే టీమ్ ఇండియా ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్లతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది భారత్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌లలో విజయం సాధించింది.

Continues below advertisement

  • భారత్ వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 3- 0 తేడాతో గెలుపు
  • భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుంది
  • భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: భారత్ 1- 2తో ఓటమి
  • భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా: భారత్ 2- 1 తేడాతో గెలుపు

టీ20ల్లో అద్భుతమైన రికార్డు

2025లో భారత జట్టు టీ20 రికార్డు కూడా అద్భుతంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు ఈ ఏడాది కేవలం 3 టీ20 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. 2025లో భారత్ 21 టీ20 మ్యాచ్‌లలో 16 విజయాలు సాధించి, కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే నిరాశ పరిచింది. అయితే 2 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ఈ ఏడాదే భారత్ టీ20 ఫార్మాట్‌లో ఆడిన ఆసియా కప్ 2025ను కూడా గెలుచుకుంది. ఈ ఏడాది భారత్ ఏ టీ20 సిరీస్‌ను ఓడిపోలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్ ను 3-1 తేడాతో సాధించింది.

  • భారత్ వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 4-1 తేడాతో గెలుపు
  • భారత్ ఆసియా కప్ 2025 టైటిల్ గెలుచుకుంది
  • భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: భారత్ 2-1 తేడాతో గెలుపు
  • భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా: భారత్ 3-1 తేడాతో గెలుపు