స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న టీ 20(T20)సిరీస్‌లో టీమిండియా(Team India) జోరు మాములుగా లేదు. ఇప్పటివరకూ జరిగిన రెండు టీ 20ల్లోనూ యువ భారత జట్టు రెండుసార్లు 200కుపైగా పరుగులు సాధించింది. భారత టాపార్డర్ రాణిస్తుండడంతో టీమిండియా భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న ఆటగాళ్లు కంగారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. మరో కొన్ని నెలల్లో టీ 20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల ఆట ఆకట్టుకుంటోంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ 20లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 24 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టిన జైస్వాల్.. మొత్తంగా 25 బాల్స్ ఆడి 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఏ భారతీయ బ్యాటర్‌కు ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును యశస్వి తన పేరిట లిఖించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ 20లో యశస్వి జైస్వాల్ 25 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ చేసిన మూడో ఇండియన్ బ్యాటర్‌గా కూడా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పవర్ ప్లేలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో పపర్‌ప్లే ఓవర్లలోనే రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ , రాహుల్ ఇద్దరూ కూడా పవర్ ప్లేలో 50 పరుగులే చేశారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ 53 రన్స్ కొట్టి వీరిద్దరి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి తన పేరిట లిఖించుకున్నాడు.
కంగారులతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సేన.. అనంతరం కంగారులను కంగారు పెట్టి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. టపార్డర్ రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు.ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 426 పరుగులు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఇది ఎంత తప్పుదు నిర్ణయమో కంగారులకు పవర్ ప్లే లోనే అర్ధం అయింది. టీమిండియా బ్యాటర్లు మరోసారి జూలు విదిల్చడంతో కంగారులపై భారత, జట్టు మరోసారి భారీ స్కోరు చేసింది. తొలి టీ20 మ్యాచ్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఈసారి తొలుత బాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. యశస్వి జైస్వాల్... భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం ఆరు ఓవర్ లలో 77 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జైస్వాల్ 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాదు. జైస్వాల్ ని ఇంగ్లీష్ అవుట్ చేశాడు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply