WPL 2025 Schedule: ఇండియాలో పొట్టి ఫార్మాట్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు తెరలేచింది. మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కు టీజర్ గా ఈ టోర్నీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళల విభాగంలో బీసీసీఐ టోర్నీ నిర్వహిస్తోంది. ఉత్కంఠ పరంగా ఐపీఎల్ తో పోటీపడేవిధంగా ఈ టోర్నీ సాగుతోంది. ఈ ఏడాది మూడో ఎడిషన్ ను బీసీసీఐ నిర్వహిస్తోంది. గతేడాది టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ తొలి లీగ్ మ్యాచ్ లో తలపడనుంది. వడొదర క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సారి నాలుగు వేదికలలో ఈ మ్యాచ్ లు జరుగుతుండటం విశేషం. వడొదరతోపాటు ముంబై, లక్నో, బెంగళూరులో మ్యాచ్ లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగబోతున్న బెంగళూరు.. మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ఉత్సాహంగా ఉంది. 2008 నుంచి బెంగళూరు ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ ఆ జట్టు యాజమాన్యానికి కప్పు ఎప్పుడు లభించలేదు. అయితే మహిళల విభాగంలో మాత్రం తొలిసారి బెంగళూరు విజేతగా నిలిపీ ఆర్సీబీ అభిమానులను అనందడోలికల్లో నిలిపింది. ఇక ఈటోర్నీలో ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ గెలిచింది. అయితే గత రెండు ఎడిషన్లలో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచింది.
రౌండ్ రాబిన్ లీగ్ లో..
టోర్నీలోని ప్రతి జట్టు మరో జట్టుతో రెండేసి చొప్పున మ్యాచ్ లు ఆడతాయి. అలా మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్ లో నిలిచిన జట్టు నేరుగా పైనల్ కు అర్హత సాధిస్తుంది. టాప్ 2, 3 జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. బెంగళూరును స్మృతి మంధాన, ముంబైని హర్మన్ ప్రీత్ కౌర్, యూపీని దీప్తి శర్మ, ఢిల్లీని మెగ్ ల్యానింగ్, గుజరాత్ ను అష్లీ గార్డెనర్ కెప్టెన్లుగా నడిపిస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీ స్పోర్ట్స్ 18 2 చానల్, జియో సినిమా ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు దాదాపు నెలరోజుల పాటు జరుగుతుంది.
జట్ల వివరాలు..
రాయల్ చాలెంజర్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా, జోషిత రాఘవి బిస్త్ , జాగ్రవి పవార్, ప్రేమ రావత్
ముంబై ఇండియన్స్: అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్, జి కమలిని, నాడిన్ డి క్లర్క్, అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా.
ఢిల్లీ క్యాపిటల్స్: అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్ (కెప్టెన్), మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్, ఎన్. చరణి, నందిని కశ్యప్, సారా బ్రైస్, నికి ప్రసాద్.
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ (కెప్టెన్), గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా, అలానా కింగ్, అరుషి గోయెల్,క్రాంతి గౌడ్.
గుజరాత్ జెయింట్స్ :ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే, సిమ్రాన్ షేక్, డియాండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్, ప్రకాశిక నాయక్.
Read Also: RCB Captain IPL 2025: RCB కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ -అభినందించిన కోహ్లీ