DC-W vs RCB-W, 1 Innings Highlight: డెత్‌ ఓవర్లలో రెచ్చిపోయిన పెర్రీ, రిచా - డీసీకి ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?

DC-W vs RCB-W, 1 Innings Highlight: దిల్లీ క్యాపిటల్స్‌తో రెండో పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫర్వాలేదనిపించింది. పేసర్లకు సహకరిస్తున్న కఠినమైన పిచ్‌పై డీసెంట్‌ స్కోర్‌ చేసింది.

Continues below advertisement

DC-W vs RCB-W, 1 Innings Highlight:

Continues below advertisement

దిల్లీ క్యాపిటల్స్‌తో రెండో పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫర్వాలేదనిపించింది. పేసర్లకు సహకరిస్తున్న కఠినమైన పిచ్‌పై డీసెంట్‌ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 150 పరుగులు చేసింది. ఆసీస్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ (67*; 52 బంతుల్లో 4x4, 5x6) రెచ్చిపోయింది. అజేయ అర్ధశతకంతో చెలరేగింది. రిచా ఘోష్‌ (37; 16 బంతుల్లో 3x4, 3x6) మంచి కేమియోతో ఆకట్టుకుంది. డీసీ ( Delhi Capitals ) పేసర్‌ శిఖా పాండే (3/23) చక్కని బౌలింగ్‌తో అదరగొట్టింది.

స్మృతి.. నిరాశే!

ఎప్పట్లాగే ఆర్సీబీ (RCB Team)కి కోరుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ స్మృతి మంధాన (8) జట్టు స్కోరు 24 వద్దే పెవిలియన్‌ చేరి నిరాశ పరిచింది. మొదట్లో కాస్త నిలదొక్కుకొనే ప్రయత్నం చేసినా లెగ్‌సైడ్‌ బంతి వేసి శిఖా పాండే (Bowler Shika Pandey) ఆమెను ఉచ్చులో పడేసింది. ఫైన్‌ లెగ్‌లో భారీ షాట్‌ ఆడేలా చేసి ఔట్‌ చేసింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ 29/1తో నిలిచింది. మరో ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (21; 19 బంతుల్లో 3x4) షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. 8.6వ బంతికి ఆమెనూ శిఖాయే ఔట్‌ చేసింది. హీథర్‌ నైట్‌ (11) సైతం త్వరగానే డగౌట్‌ బాట పట్టింది. 

ఆదుకున్న పెర్రీ, రిచా

ఒకవైపు పరుగులు రావడం లేదు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేస్తున్నారు. అయినా ఎలిస్‌ పెర్రీ పట్టు వదల్లేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అందివచ్చిన బంతుల్ని నేరుగా స్టాండ్స్‌లో పెట్టింది. 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి 16.1 ఓవర్లకు జట్టు స్కోరును 100 పరుగుల మైలురాయికి చేర్చింది. స్లాగ్‌ ఓవర్లలో ఆర్సీబీ దూకుడు పెంచింది. రిచా ఘోష్ (Richa Ghosh) కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగింది. పెర్రీతో కలిసి నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శిఖా పాండే వేసిన 18.2వ బంతిని కీపర్‌ వెనకాల స్కూప్‌ ఆడబోయి ఆమె ఔటైంది. ఆఖర్లో ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ ఒకట్రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 150/4కి చేరుకుంది. శ్రేయాంక పాటిల్‌ (4*)కు కనెక్షన్‌ కుదర్లేదు.

Continues below advertisement