MI Allrounder Amelia Kerr: 


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఒక మ్యాచ్‌ ముగిసిందో లేదో తమ క్రష్‌ లిస్ట్‌ అప్‌డేట్‌ అయిందంటున్నారు కుర్రాళ్లు! ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ అమెలియా కెర్‌తో (Amelia Kerr) ప్రేమలో పడిపోయాం అంటున్నారు. ట్విటర్‌ నిండా ఆమె ఫొటోలు, వీడియోలే పోస్టు చేస్తున్నారు. ఆమె ఇలాగే మరిన్ని అమేజింగ్‌ పెర్ఫామెన్సెస్‌ ఇవ్వాలని ఇష్టంగా డిమాండ్‌ చేస్తున్నారు.






డబ్ల్యూపీఎల్‌ (WPL 2023) అరంగేట్రం సీజన్‌ను ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) అద్వితీయంగా ఆరంభించింది. గుజరాత్‌ జెయింట్స్‌పై (Gujarat Giants) దుమ్మురేపే విజయం నమోదు చేసింది. డీవై పాటిల్‌ వేదికగా జరిగిన పోరులో 20 ఓవర్లకు 207/5 పరుగులు చేసింది. ఆపై బౌలర్లు విజృంభించి కేవలం 15.1 ఓవర్లకే 64కు గుజరాత్‌ను కుప్పకూల్చారు. ఈ విజయంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమెలియా కెర్‌ కీలక పాత్ర పోషించింది.






మిడిలార్డర్లో క్రీజులోకి వచ్చిన అమెలియా కెర్‌ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. 24 బంతుల్లో 6 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేసి 45 పరుగులు చేసింది. 187 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టింది. గింగిరాలు తిప్పే బంతులతో ప్రత్యర్థిని బెదరగొట్టింది. 2 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు ఇచ్చింది. 2 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడిన్‌ ఓవర్‌ ఉండటం ప్రత్యేకం. ఈ రెండు వికెట్లూ ఒకే ఓవర్లో పడ్డాయి.






మ్యాచ్‌ ముగిసిన తర్వాత అమెలియా కెర్‌తో ప్రేమలో పడిపోయామని చాలామంది కుర్రాళ్లు అంటున్నారు. ఆమె అందం తమను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని చెబుతున్నారు. ఆమె చిరు నవ్వులు చిందిస్తున్న చిత్రాలను ట్విటర్లో ట్రెండింగ్‌ చేస్తున్నారు.


Also Read: ఈ సాలా కప్‌ నమదే - అమ్మాయిలైనా RCB ఫేట్‌ మారుస్తారా?


Gujarat Giants vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.