Virat Kohli ODIs Records: ఈ రోజు (నవంబర్ 2) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌పై కంటే అందరి ఫోకస్‌ విరాట్‌ కొహ్లీ రికార్డుపై ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగుల మైలురాయిని దాటే రికార్డు ఇప్పుడు సచిన్‌, కోహ్లీ పేరు మీద ఉంది. మరో 34 పరుగులు చేస్తే సచిన్‌ను అధిగమించి తన ఒక్కడి పేరిట ఆ రికార్డును నెలకొల్పనున్నాడు కోహ్లీ. వీరిద్దరూ ఒక క్యాలెండర్ ఇయర్లో ఏడుసార్లు 1000 పరుగులు సాధించారు. ఇప్పుడు కోహ్లీ 34 పరుగులు చేస్తే మాత్రం కోహ్లీ ఎనిమిదో సారి ఆ ఫీట్‌ సాధించిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. 


ఈ ఏడాది ఆడిన వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 966 పరుగులు చేశాడు. 1000 పరుగుల మైలురాయికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్ ప్రతి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్న తీరును చూస్తుంటే వెయ్యి పరుగుల చేయడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. అలా చేస్తే వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 8 సార్లు 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.


విరాట్ ఎప్పుడు 1000 పరుగులు సాధించాడు?
2011 సంవత్సరంలో 34 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 47.62 సగటుతో 1381 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి.  
2012లో 17 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 68.40 సగటుతో 1026 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
2013: 34 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌  52.83 సగటుతో 1268 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు 7 అర్థసెంచరీలు ఉన్నాయి. 
2014లో 21 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 58.55 సగటుతో 1054 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. 
2017లో 26 మ్యాచ్‌లలో 76.84 సగటుతో 1460 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.  
20148లో 14 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 133.55 సగటుతో 1202 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. 
2019లో 26 మ్యాచ్లు ఆడాడు. 59.86 సగటుతో 1377 పరుగులు చేశాడు. ఈ సంవత్సరంలో 5 సెంచరీలు చేశాడు. 


విరాట్ కోహ్లీ 2020 నుంచి ఫామ్‌లో లేడు. ఈ మూడేళ్లు ఆయనకు టఫ్‌ టైం.  ఈ క్రమంలో రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్లోనూ సెంచరీ చేయలేకపోయాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. గతేడాది ఆసియా కప్ 2022లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ ఏడాది ఆరంభం నుంచి తన మళ్లీ దూకుడు పెంచాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగుల రికార్డుకు చేరువలోకి వచ్చాడు.