ENG vs SL: బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. ప్లేయింగ్ ఎలెవన్లో ఇంగ్లాండ్ మూడు మార్పులు చేసింది. మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్‌కు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 


ప్రపంచకప్ 2023లో భాగంగా 25వ మ్యాచ్ ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులో కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే శ్రీలంక 7వ స్థానంలో, ఇంగ్లాండ్ 8వ స్థానంలో ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్‌ రెండు జట్లకు చాలా అవసరం . 


శ్రీలంక జట్టులో ఇప్పటికే మార్పులు చేసింది. వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్‌కు చోటు కల్పించింది. మాథ్యూస్ ప్లేయింగ్ ఎలెవన్లో చేరితే ప్రయోజనం ఉంటుందని లంక భావిస్తోంది. పతిరానా స్థానంలో మాథ్యూస్‌ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా పతిరానా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్ 2023లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక నాలుగో మ్యాచ్లో విజయం సాధించింది. నెదర్లాండ్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. శ్రీలంక కేవలం 2 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది.


శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్లో మాథ్యూస్
పాథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్/ కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అస్లంకా, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహిష్ తిక్షణ, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక.


ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్