Pahalgam Terrorist Attack: పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత ఇప్పుడు పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని భారతదేశం నిశ్చయించుకుంది. భారతదేశం ఉగ్రవాద దేశానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సీసీఎస్ సమావేశంలో సింధు జల ఒప్పందం రద్దు, పాకిస్థానీయులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది.

ఇప్పుడు బీసీసీఐ తరపున బిగ్ స్టేట్మెంట్ వచ్చింది.  భవిష్యత్తులో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై కీలక ప్రకటన చేేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా  పహల్గామ్‌ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. దుర్ఘటనలో నష్టపోయిన బాధితులకు అండగా నిలబడాల్సిన టైం అని అన్నారు. ఈ ఘటనతో  భారత్ , పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఎలా ఉంటాయనే  ప్రశ్నిస్తే....  ప్రభుత్వం ఏమి చెబితే అది చేస్తామని అన్నారు. ప్రభుత్వం గతంలో నిర్ణయించినందుననే ఇప్పటి వరకు  పాకిస్థాన్‌తో ద్వైపాక్షక సిరీస్‌లు ఆడం లేదు. ఇకపై కూడా  పాకిస్థాన్‌తో  ద్వైపాక్షిక  సిరీస్‌లు ఉండవు. ఐసీసీ ఈవెంట్ విషయానికి వస్తే, ఐసీసీ ఇన్వాల్వమెంట్ కారణంగా  ఆడుతున్నాము అని అన్నారు. 

భారత్-పాకిస్థాన్ మధ్య ఆఖరి ద్వైపాక్షిక  మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

రెండు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక లిమిటెడ్ ఓవర్స్ (50 ఓవర్లు) సిరీస్ 2012-13లో జరిగింది, ఆ సమయంలో భారత్‌ వచ్చిన పాకిస్థాన్‌ ఈ సిరీస్ అడింది. పాకిస్థాన్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆడటానికి వచ్చింది.

పాకిస్థాన్ సమావేశం ఏర్పాటు చేసింది

పాలఘాట్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సీసీఎస్ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్థాన్ ప్రధానమంత్రి షాహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం గురువారం ఏప్రిల్ 24న జరగాలి.

ఈ ప్రకటన పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్టు చేశారు. జాతీయ భద్రత చర్చ  ప్రధాన అంశం అని ధృవీకరించారు. ఇంకా ఏం రాశారంటే... "ప్రధానమంత్రి మొహమ్మద్ షాహబాజ్ షరీఫ్ భారత ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా గురువారం ఉదయం ఏప్రిల్ 24న జాతీయ భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు." అని తెలిపారు.