India vs England: విరాట్ కోహ్లీ, MS ధోనీ టెస్టులలో భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పరిగణిస్తారు. కానీ వారు తమ సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలవలేదు. టీమ్ ఇండియా చివరిసారిగా 18 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇది జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.

Continues below advertisement


గిల్‌కు 18 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించే అవకాశం


ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ తొలిసారిగా కెప్టెన్‌గా ఆడనున్నాడు. అతనికి ఇది అంత సులభం కాదు. కానీ గిల్ జట్టులో కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు, మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చే సత్తా కలిగి ఉన్న ఆటగాళ్లు వీళ్లంతా. అటువంటి పరిస్థితిలో, టీమ్ ఇండియా ఇంగ్లండ్‌కు గట్టి పోటీనిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కూడా గెలుచుకోవచ్చు. ఒకవేళ ఈ జట్టు అలా చేయగలిగితే, 18 సంవత్సరాల తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌లో సిరీస్‌ను గెలుచుకుంటుంది. భారత జట్టు చివరిసారిగా 2007లో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.


ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్


భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20 నుంచి హెడింగ్లీలో జరగనుంది. అదే సమయంలో, రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమవుతుంది. మూడో మ్యాచ్ జులై 10 నుంచి లార్డ్స్‌లో జరగనుంది. సిరీస్‌లో నాల్గో మ్యాచ్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. అదే సమయంలో, సిరీస్‌లో చివరి మ్యాచ్ జులై 31 నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది.


ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టు


శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.


ఇప్పుడు భారత క్రికెట్ కీలక దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ముగ్గురు గొప్ప ఆటగాళ్ళు టెస్ట్ ఫార్మాట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా T20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత టెస్ట్ జట్టు కొత్త శకం ఆరంభం కానుంది. ఈ మార్పు దశలో జట్టు నిర్వహణ,  సెలక్షన్ కమిటీ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది.


క్రిక్‌బ్లాగర్ ప్రకారం, అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగవచ్చని BCCI వర్గాలు తెలిపాయి. అతని పదవీకాలం పొడిగించవచ్చని సమాచారం. కానీ దానిని నిర్ధారించడానికి బోర్డు పూర్తి ప్రక్రియను అనుసరిస్తుంది.


అజిత్ అగార్కర్ జూలై 2023లో చీఫ్ సెలెక్టర్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఆధ్వర్యంలో భారత జట్టు 2024 T20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ సమయంలో భారత జట్టు 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్ ఆడింది. సోర్స్‌ ప్రకారం అనేక అంశాలపై భారత జట్టు నిర్వహణపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్‌లో ఆయన పాత్ర ఉందని కూడా చెబుతారు. ఇప్పుడు ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కూడా వీళ్లందరికి కీలక మలుపుగా చెబుతారు. అందుకే కచ్చితంగా గెలవాలని కసితో బరిలోకి దిగుతున్నారు.