ICC Womens ODI World Cup 2025: మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడతారు. వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ప్రతి మ్యాచ్ వేదిక మరియు సమయం వివరాలు ఇక్కడ ఉన్నాయి.

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 మొదటి మ్యాచ్ మంగళవారం, సెప్టెంబర్ 30న బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరిగే ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని R ప్రేమదాస స్టేడియంలో ఆడేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

 ప్రపంచ కప్‌లో ఆతిథ్య భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పాల్గొంటాయి. ఫార్మాట్ గురించి చెప్పాలంటే ఇది రౌండ్-రాబిన్ మెథడ్‌లో జరుగుతుంది. తర్వాత 2 సెమీ-ఫైనల్స్ ఉంటాయి. సెమీఫైనల్ విజేతలు ఫైనల్లో వరల్డ్ కప్ కోసం తలపడతారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఏ తేదీన, ఏ వేదికపై జరుగుతుంది?

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. శ్రీలంకలోని కొలంబోలోని R. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ప్రపంచ కప్‌లో భారత జట్టు షెడ్యూల్

  • సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలకు
  • అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు

 

మహిళల ODI ప్రపంచ కప్ 2025 షెడ్యూల్

  • మంగళవారం, సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు
  • బుధవారం, అక్టోబర్ 1: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • గురువారం, అక్టోబర్ 2: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • శుక్రవారం, అక్టోబర్ 3: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు
  • శనివారం, అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • ఆదివారం, అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • సోమవారం, అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • మంగళవారం, అక్టోబర్ 7: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలకు
  • బుధవారం, అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • గురువారం, అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • శుక్రవారం, అక్టోబర్ 10: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • శనివారం, అక్టోబర్ 11: ఇంగ్లాండ్ vs శ్రీలంక - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలకు
  • ఆదివారం, అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • సోమవారం, అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • మంగళవారం, అక్టోబర్ 14: న్యూజిలాండ్ vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • బుధవారం, అక్టోబర్ 15: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • గురువారం, అక్టోబర్ 16: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • శుక్రవారం, అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • శనివారం, అక్టోబర్ 18: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • ఆదివారం, అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • సోమవారం, అక్టోబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • మంగళవారం, అక్టోబర్ 21: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • బుధవారం, అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • గురువారం, అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలకు
  • శుక్రవారం, అక్టోబర్ 24: పాకిస్తాన్ vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • శనివారం, అక్టోబర్ 25: ఆస్ట్రేలియా vs శ్రీలంక - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలకు
  • ఆదివారం, అక్టోబర్ 26: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ - గౌహతి - ఉదయం 11 గంటలకు
  • ఆదివారం, అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు
  • బుధవారం, అక్టోబర్ 29: సెమీ-ఫైనల్ 1 - గౌహతి/కొలంబో - మధ్యాహ్నం 3 గంటలకు
  • గురువారం, అక్టోబర్ 30: సెమీ-ఫైనల్ 2 - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు
  • ఆదివారం, నవంబర్ 2: ఫైనల్ - కొలంబో/బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలకు

ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరితే.. 

పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరితే అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. సెమీస్ గెలిచి పాక్ ఫైనల్ కనుక చేరితే ఫైనల్ కూడా అక్కడే జరుగుతుంది. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరకపోతే మొదటి సెమీఫైనల్ గౌహతిలో, ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో నిర్వహించేలా ప్లాన్ చేశారు.