India vs Australia 1st ODI match live streaming | భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా అరంగేట్రం చేయనున్నాడు. టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌లో భాగం కానున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోకో ద్వయం మొదటిసారిగా మైదానంలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఆడనున్నారు. గత ఏడెనిమిదేళ్లుగా కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్, హిట్ మ్యాన్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడారని తెలిసిందే. ఇప్పుడు గిల్ సారథ్యంలో వీరు ఆటనుండటం ప్రత్యేకత.
స్మిత్, కమ్మిన్స్, లాబుషేన్ లేరు
ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ఇంకా గాయం నుండి కోలుకోని కారణంగా కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్ కూడా ఈ సిరీస్ ఆడటం లేదు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే ఎప్పుడు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆదివారం (అక్టోబర్ 19న) జరగనుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి వన్డే ఆడతారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే వేదిక ఎక్కడ
భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ మొదటి వన్డే మ్యాచ్ పెర్త్ స్టేడియంలో ఆడతారు.
తొలి వన్డే ఎన్ని గంటలకు ప్రారంభం
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగే మొదటి వన్డే టాస్ ఆదివారం ఉదయం 8:30 గంటలకు వేస్తారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత్, ఆస్ట్రేలియా వన్డేలు ఎక్కడ లైవ్ చూడవచ్చు?
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేని టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. మొబైల్‌లో మ్యాచ్‌లు చూసే వీక్షకులు ఈ మ్యాచ్‌ను జియోహోట్‌స్టార్ (Jio Hotstar)లో చూడవచ్చు.
వన్డే సిరీస్ కోసం భారత జట్టు- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.
వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు- మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కోనోలీ, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నెమన్, మార్నస్ లాబుషేన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్.