West Indies World Record; పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ కు తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్ లో విండీస్ 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే అనుకోని వరంలా 148 టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ నమోదు కానీ రికార్డును మాత్రం ఒడిసి పట్టింది. వెస్టిండీస్ కు చెందిన చివరి ముగ్గరు బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో జట్టు తరపున అత్యధిక స్కోర్లు సాధించారు. ఒక దశలో 66/8తో నిలిచిన విండీస్.. గుడకేశ్ మోటీ, జోమెల్ వర్రికన్, జైడెన్ సీల్స్ ల పోరాట పటిమతో 137 పరుగులు సాధించింది.


ఇందులో నెంబర్ 9 లో బ్యాటింగ్ చేసిన మోటి 19 పరుగులు చేయగా, పదో నెంబర్ లో బ్యాటింగ్ కు దిని వర్రికన్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 11వ నెంబర్ బ్యాటర్ సీల్స్ 22 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో చివరి ముగ్గురు బ్యాటర్లు విండీస్ తరపున తొలి ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా నిలిచారు. వీరి తర్వాత నమోదైన అత్యధిక స్కోరు కేవలం 11 కావడం గమనార్హం. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ ఈ పరుగులు సాధించాడు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ లో ఈ ముగ్గురు ప్లేయర్లు డకౌట్ కావడం కొసమెరుపు. దీంతో 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా చివరి ముగ్గురు బ్యాటర్లు జట్టు తరపున అత్యధిక స్కోర్లు చేసిన ప్లేయర్లు గా నిలవడం విశేషం. 


తొలి టెస్టులో విండీస్ చిత్తు..
దశాబ్ధాల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన విండీస్ కు చేదు అనుభవం ఎదురైంది. తొలి టెస్టులో 127 పరుగులతో పరాజయం పాలైంది. ముల్తాన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ తొలి ఇన్నింగ్స్ లో 230 పరుగులు చేయగా, విండీస్ కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పాక్ 157 పరుగులకే ఆలౌటై, 251 పరుగుల టార్గెట్ ను కరీబియన్ జట్టు ముందు ఉంచింది. అయితే ఛేదనలో 123 పరుగులకే విండీస్ కుప్పకూలింది. దీంతో 127 పరుగులతో పాక్ భారీ విజయం సాధించింది. మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు తీసిన పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ ఓడిపోయిన వర్రీకన్ విండీస్ తరపున ఆకట్టుకున్నాడు. పది వికెట్లు తీసి సత్తా చాటాడు. 


చావోరేవో..
రెండు టెస్టులో సిరీస్ లో ఇప్పటికే ఒక టెస్టు కోల్పోయిన విండీస్.. ముల్తాన్ లోనే ప్రారంభమయ్యే రెండోటెస్టులో కచ్చితంగా విజయం సాధించాలని భావిస్తోంది. లేకపోతే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అట్టడుగు స్థానాన్ని పొందుతుంది. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టులో విజయం సాధించడానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. మరోవైపు రెండో టెస్టులో గెలిచి వరుసగా రెండో సిరీస్ ను పట్టేయ్యాలని పాక్ పట్టుదలగా ఉంది. గతేడాది ఇంగ్లాండ్ పై సిరీస్ నెగ్గిన పాక్.. ఇప్పుడు విండీస్ పై సిరీస్ నెగ్గి, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. 


Also Read: Sanju Samson: ఆ కారణాలతోనే సంజూకి చోటు దక్కలేదు - బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యలు