టీ20 వరల్డ్ కప్ 2022 దగ్గరపడింది. ప్రపంచ కప్‌నకు రెండు వారాల సమయం కూడా లేదు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ ప్రపంచకప్‌లో ఆడేందుకు వెళ్లిన టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. కానీ బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త టెన్షన్ ఉండనే ఉంది. కీలకమైన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా చేరుకున్న టీంలో ఉన్న ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్‌నకు ఎంత సన్నదతో ఉన్నరో ఓసారి చూద్దాం. ఏడాదిగా వాళ్ల ఆటతీరు ఎలా ఉందో మీకు చెబుతాము. గత టి20 ప్రపంచ కప్ నుంచి ఏ ఆటగాడు ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడో, ఎవరు ఎన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారో చెబుతాము.
టాప్ ఆర్డర్
కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చాలా కాలంగా జట్టు టాప్ ఆర్డర్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ టాప్ ఆర్డర్ టీ20 వరల్డ్ కప్‌లో కూడా కనిపిస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ నుంచి టీమ్ ఇండియా మొత్తం 59 మ్యాచ్‌లు ఆడింది. అందులో 35 టీ20 మ్యాచ్ ఆడింది. ఈ 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ 25 మ్యాచ్‌లు ఆడలేదు. కేఎల్ రాహుల్ మొత్తం 37 మ్యాచ్‌లలో కనిపించలేదు. విరాట్ కోహ్లీ 59 మ్యాచుల్లో 31 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. విరాట్ 35 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
మిడిల్ ఆర్డర్
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. సూర్య 35 టీ20ల్లో 26 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే హార్దిక్ పాండ్యా 19 మ్యాచ్‌లు ఆడాడు. ఫినిషర్‌గా కనిపించిన దినేశ్ కార్తీక్ కూడా మొత్తం 11 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అక్షర్ పటేల్ గురించి మాట్లాడితే 20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది.
బుమ్రా, జడేజాకు బ్యాడ్ టైం
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకోవడానికి అతనికి చాలా నెలలు సమయం పట్టింది. గత టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా టీమ్ఇండియా తరఫున కేవలం 5 టీ20లు, మొత్తం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌నకు దూరమయ్యాడు.
రవీంద్ర జడేజా గత టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టు తరఫున కేవలం 9 టీ20 ఇంటర్నేషనల్స్, మొత్తం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆసియా కప్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడుతూ జట్టుకు దూరమయ్యాడు.
ఐపీఎల్‌లో ఫుల్ అటెండెన్స్
ఐపిఎల్ మ్యాచ్‌ల గురించి మాట్లాడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడారు. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడిన తర్వాత ప్లేఆఫ్స్కు దూరమైంది.