Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

T20 World Cup 2024 Final IND vs SA: సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ టీ20 ప్రపంచకప్ ఒడిసి పట్టింది. విశ్వ విజేతగా నిలిచింది. అయితే అదే రోజు ఇద్దరి ప్రయాణం ముగిసింది. వారే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.

Continues below advertisement

Rohit and Kohli: కోట్లాది భారతీయుల ఏళ్ళ నీరీక్షణ ఫలించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా(Team India) అద్భుత విజయం సాధించింది. ఓ వైపు సంబరాలు జరుగుతున్నాయి. ఆటగాళ్ళు ఆనంద పారవశ్యంలో ఉన్నారు. ఒకరిని ఒకరు హత్తుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ మురిసిపోతున్నారు. సమయం చూసుకొని విషయం చెప్పేశాడు కింగ్ కోహ్లీ(Virat Kohli).  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అత్యుత్తమ ఆటగాడు టీ 20 ఫార్మెట్ క్రికెట్ కి సెలవు  ప్రకటించేశాడు. ఇక కొత్త తరం రావాల్సిన సమయం ఆసన్నం అయింది అన్నాడు. తాను ఏం కోరుకున్నాడో అది సాధించానని చెప్పాడు. ఆ విషయం విని  అభిమానులే కాదు తోటి ఆటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. 

Continues below advertisement

కోహ్లీ ప్రకటన నుంచి తెరుకొనేలోగానే రోహిత్ శర్మ (Rohit Sharma) బాంబ్ పేల్చాడు. తను కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో బార్బడోస్‌లో  జరిగిన ఫైనల్‌ ఫైట్ లో విజయం సాధించిన  తరువాత  రోహిత్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. టీ20ల నుంచి సెలవు తీసుకొనేందుకు ఇంతకన్నా మంచి సమయం లేదన్నాడు. రిటైర్మెంట్ ప్రకటన వల్ల మాటలు రావటం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు హిట్ మ్యాన్. మొత్తానికి దేశాన్ని విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మొనగాళ్ళు ఆడే రోజు ఆటకు వీడ్కోలు చెప్పి జూన్ 29 వ తేదీని చరిత్రలో గుర్తుండిపోయేలా చేశారు. 

మొత్తం అసలు క్రికెట్ కెరియర్లో ఈ ఇద్దరు ఒకరికి ఒకరు అండగా నిలబడిన విధానం, మానసిక ధైర్యాన్ని ఇచ్చి పుచ్చుకున్న తీరు వారి స్నేహాన్ని బయటపెడుతుంది. స్నేహం అంటే కలిసి తిరగడం తినడం కాదు. ఒకరికి ఒకరు తెలుపుకొనే మద్దతు . కెప్టెన్ గా ఉన్నా, ఆటగాడినా మిగిలినా  ఇద్దరి మధ్యా ఎక్కడా  ఆధిపత్య ధోరణి కనిపించకపోవటం ఈ జంట లో ప్రత్యేకత.  ఒకరు నాయకత్వంలో మరొకరు ఫెయిల్ అయినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు ఒకరి మీద ఒక  సింపతీ చూపించుకోలేదు. ఒకరి మీద ఒకరు అవకాశం దొరికింది కదా అని ఆధిపత్యం చూపించలేదు.   ఒకరికొకరు అండగా నిలబడ్డారు.  రోహిత్ ని తీసేయచ్చుగా అని ఓ ప్రెస్మీట్ లో అడిగిన వారికి కోహ్లీ ఇచ్చిన జవాబు ఇప్పటకీ వైరల్ గానే ఉంది. ఇక టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీ ఫెయిలైతే  బలాన్ని దాచుకుంటున్నాడు అంటూ సరదాగా నవ్వేసిన రోహిత్ తెలుసు మనకి. 

 ఇద్దరి మధ్య అస్సలు అండర్స్టాండింగ్ లేదు, ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళిద్దరు ఒకే లక్ష్యంతో లేరని, వారి దారులు వేరని మాట వచ్చినప్పుడు ఆ ఇద్దరు నవ్వుకొనే ఉంటారు. అలా ఇద్దరు సమఉజ్జీలు ఒకరికొకరు మద్దతుగా నిలబడటమే ఈ జట్టును విశ్వవిజేత గా నిలిపింది.  ఈ ఇద్దరూ కలిసి  చేసిన సందడి, దిగిన ఫోటోలు భావోద్వేగపు  కౌగిలింతలు, హ్యాపీ మూమెంట్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Continues below advertisement