Vaibhav Sooryavanshi Hints India Debut On Instagram: యూకే టూర్ లో వరుసగా మూడు మ్యాచుల పాటు బెంచ్ కే పరిమితమైన 15 ఏళ్ల విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్‌తో శనివారం జరగబోయే సెండ్ టీ20 మ్యాచ్ లో ఫైనల్ గా ఇండియా డెబ్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లతో పాటు ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనూ ఇతనికి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ కు ముందే వైభవ్ తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ లో "న్యూ చాప్టర్" అనే క్యాప్షన్ తో ఒక స్టోరీ షేర్ చేసి, తాను ఇండియా జెర్సీ ధరించబోతున్నట్లు ఒక బిగ్ హింట్ ఇచ్చాడు. ప్రెజెంట్ ఈ సోషల్ మీడియా పోస్ట్ క్రికెట్ సర్కిల్స్ లో ఫుల్ వైబ్రేషన్స్ తెస్తోంది.
వరల్డ్ కప్ హీరోలకు రెస్పెక్ట్ ఇవ్వాలి.. వైభవ్ ఎంట్రీపై వస్తున్న హైప్ పై ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ శుక్రవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. వైభవ్ కోసం వరల్డ్ కప్ హీరోలను అంత ఈజీగా త్యాగం చేయలేమని చెప్పాడు. "సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు వరకు వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ, అలాగే టీ20 వరల్డ్ కప్ 2026 లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచిన సంజూ శాంసన్ లకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. శాంసన్ ఐపీఎల్ లోనూ సూపర్ గా ఆడాడు. కోచింగ్ స్టాఫ్ గా మా ప్లేయర్లపై నమ్మకం ఉంచడం, వారికి సపోర్ట్ ఇవ్వడం మా బాధ్యత. ఒక కుర్రాడు టీమ్ డోర్ నాక్ చేస్తున్నాడు, అది నిజంగా ఎగ్జైటింగ్ విషయమే. కానీ కేవలం ఆ ఇద్దరి కోసమే కాదు, టీమ్ లోని మిగిలిన ప్లేయర్ల కాన్ఫిడెన్స్ కోసం కూడా సీనియర్లను బ్యాక్ చేయడం చాలా అవసరం" అని మోర్కెల్ స్పష్టం చేశాడు.
నెట్స్ లో వైభవ్ సంచలన రీల్స్.. ప్లేయర్లు బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ వారికి లాంగ్ రోప్ ఇవ్వడం చాలా ముఖ్యమని మోర్కెల్ అన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఇండియాకు వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయర్ల వెంటే నిలబడి, టాప్ ఆర్డర్ ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. అయితే నెట్స్ లో వైభవ్ ఆడుతున్న షాట్లు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయని కోచ్ ఒప్పుకున్నాడు. "15 ఏళ్ల ఏజ్ లో ఇంటర్నేషనల్ స్టేజ్ నెట్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా ప్రెజర్ తో కూడుకున్న పని. కానీ వైభవ్ ఆడిన కొన్ని సెషన్స్ చూస్తే అతను మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశాడు. అతను ఎప్పుడు గ్రౌండ్ లోకి వచ్చినా పర్ఫార్మ్ చేయడానికి వంద శాతం రెడీగా ఉన్నాడు. టీమ్ లో అతను చాలా స్మూత్ గా కలిసిపోయాడు. అతని ఆట చూడటానికి మేమంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం" అని మోర్కెల్ స్పష్టం చేశాడు.
సంజూ శాంసన్ కు లాస్ట్ ఛాన్స్ క్లోజ్.. యూకే టూర్ లో సంజూ శాంసన్ ప్రెజెంట్ చాలా వరస్ట్ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నాడు. లాస్ట్ మూడు ఇన్నింగ్స్‌లలో 5, 0, 1 రన్స్ మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అవ్వడం అతని ప్లేస్ ను క్వశ్చన్ మార్క్ లో పడేసింది. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్ సూర్యవంశీకి సీనియర్ ఇండియా క్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయితే మాత్రం ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ పై వేటు పడటం ఖాయం. శాంసన్ ను బెంచ్ పై కూర్చోబెట్టి అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ను ఓపెనర్‌గా పంపించే కఠిన నిర్ణయాన్ని గంభీర్ తీసుకోబోతున్నాడని, ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ ను దెబ్బకొట్టడానికి ఈ నయా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందని క్రికెట్ అనలిస్ట్ లు పేర్కొంటున్నారు.
