BCCI Vice President Defends Team Management:  ఇంగ్లాండ్ టూర్ లో ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ వివాదంపై బీసీసీఐ (BCCI) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో వైభవ్ ఇండియా తరఫున డెబ్యూ ఇస్తాడని అందరూ ఎక్స్ పెక్ట్ చేసినా మేనేజ్‌మెంట్ మాత్రం పాత ఓపెనింగ్ కాంబినేషన్ అయిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లకే ఓటు వేసింది. లాస్ట్ మంత్ ఐర్లాండ్ తో జరిగిన టూ-మ్యాచ్ సిరీస్ లోనూ ఈ బ్యాటింగ్ సెన్సేషన్ ను బెంచ్ కే పరిమితం చేయడం, పైగా అక్కడ ఇండియా 0-2 తో ఘోరంగా ఓడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లపై ఫ్యాన్స్, మాజీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ డిబేట్ పై తాజాగా మాట్లాడిన రాజీవ్ శుక్లా టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ కోచ్, కెప్టెన్ లపై అనవసరంగా చేస్తున్న కామెంట్స్ పై ఫైర్ అయ్యారు.

Continues below advertisement

Read Also: Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!

ఫైనల్ డెసిషన్ కోచ్, కెప్టెన్ లదే.. వైభవ్ సూర్యవంశీ టాలెంట్ పై తమకు ఎలాంటి డౌట్స్ లేవని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. "వైభవ్ చాలా టాలెంటెడ్ ప్లేయర్, ఐపీఎల్ లో అతను ఆ అద్భుతమైన ఆటను ఆల్రెడీ చూపించాడు. కానీ ప్రెజెంట్ టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్ లపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ను నేను చూశాను. నేను ఒక్కటే క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా, ప్లేయింగ్ ఎలెవన్ పై ఫైనల్ డెసిషన్ తీసుకునే రైట్స్ కేవలం కోచ్, కెప్టెన్ లకే ఉంటాయి. వారు ప్రెజెంట్ సిట్యుయేషన్ ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కరెక్ట్ టైమ్, రైట్ అపార్చునిటీ వచ్చినప్పుడు వైభవ్‌కు కచ్చితంగా ఛాన్స్ ఇస్తారు" అని శుక్లా గట్టిగా చెప్పారు.

Continues below advertisement

Read Also: India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!

అనవసర కామెంట్స్ పై అసంతృప్తియంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ టైమ్ చాలా త్వరలోనే వస్తుందని, కానీ ఆ డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ కంప్లీట్‌గా మేనేజ్‌మెంట్‌కు ఇవ్వాలని శుక్లా సజెస్ట్ చేశారు. "ఇలాంటి కీలకమైన సెలెక్షన్ డెసిషన్లను టీమ్ మేనేజ్‌మెంట్ విచక్షణ కే వదిలేయాలి. అసలు ఈ విషయంలో ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో, ఎందుకు అంత అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు" అని శుక్లా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బోర్డు ఎప్పుడూ మేనేజ్‌మెంట్ నిర్ణయాల వెంటే ఉంటుందని అతను హింట్ ఇచ్చారు.

ఐపీఎల్ లో రికార్డ్ బ్రేకర్.. సెలెక్టర్ల హ్యాండ్స్ ఫోర్స్ చేసిన వండర్ కిడ్ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 237.30 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 776 రన్స్ స్కోర్ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కొల్లగొట్టాడు. అతని అన్‌బిలీవబుల్ టాలెంట్, పర్ఫార్మెన్స్ చూశాక జాతీయ సెలెక్టర్లు సైతం అతన్ని నేరుగా టీ20 టీమ్‌లోకి సెలెక్ట్ చేయక తప్పలేదు. అయితే ఐర్లాండ్ చేతిలో షాకింగ్ ఓటమి ఎదురైనా మేనేజ్‌మెంట్ మాత్రం అతన్ని ఫస్ట్ ఎలెవన్ లోకి తీసుకోకుండా హోల్డ్ లో పెట్టడం వల్లే ఈ వివాదం పెద్దదైంది.