Why Vaibhav Sooryavanshi Is Only Warming The Bench:  అద్భుతమైన టాలెంట్ తో వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా డెబ్యూ ప్రెజెంట్ వాయిదా పడింది. ఐరిష్ గడ్డపై అరంగేట్రం తెచ్చుకుంటాడనుకున్న క్రేజ్ తెచ్చిన ఈ బిహార్ యంగ్ స్టార్, ఇంగ్లాండ్ ప్లేయర్లను సైతం భయపెడుతున్నా కేవలం డ్రింక్స్ మోయడానికే పరిమితమయ్యాడు. దీనికి మెయిన్ రీజన్ టీమ్ లోని ‘హైరార్కీ’ అని తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్ సిస్టమ్ దెబ్బతినకుండా ఉండేందుకే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లపై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ కూడా వైభవ్ రెడీగా ఉన్నా శాంసన్ లాంటి వరల్డ్ కప్ విన్నర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం ప్రాసెస్ లో భాగమని చెప్పాడు. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే మాట చెప్తూ మెయిన్ పిల్లర్స్ ను పక్కన పెట్టలేమని, ప్లేయర్లకు సెక్యూరిటీ ఇవ్వడం ముఖ్యమని చేస్టర్-లీ-స్ట్రీట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశాడు.

Continues below advertisement

Read Also: Knight Riders Creates History: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!

టీమిండియా ప్లానింగ్ పై సునీల్ గవాస్కర్ అసంతృప్తిఇండియా క్యాంప్ ఈ ప్రాసెస్ ను సమర్థిస్తున్నా లెజెండరీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మాత్రం మేనేజ్‌మెంట్ యాటిట్యూడ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూకే టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా మూడు మ్యాచుల్లో వైభవ్‌ను బెంచ్ పై కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని గవాస్కర్ ఇండియా టుడేతో అన్నాడు. "యంగ్ ప్లేయర్లను టెస్ట్ చేయడానికి ఐర్లాండ్ సిరీస్ ఒక బెస్ట్ అపార్చునిటీ. ఇన్ ఫామ్ లో ఉన్న వైభవ్‌ను రెండు మ్యాచుల్లోనూ ఆడించాల్సింది. దీనివల్ల నెక్స్ట్ అతనికి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అయితే 15 ఏళ్ల ఏజ్ లో ప్రెజర్ గురించి ఎక్కువగా ఆలోచించరు కాబట్టి దొరికిన తక్కువ టైమ్ లోనే అతను సత్తా చాటాల్సి ఉంటుంది" అని గవాస్కర్ అనలైజ్ చేశాడు.

Continues below advertisement

Read Also: IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్!

ఇంగ్లాండ్ ప్యాంట్లు ఊడదీసేవాడు.. రవిశాస్త్రి బోల్డ్ కామెంట్స్మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ట్రేడ్‌మార్క్ స్టైల్ లో సోనీ స్పోర్ట్స్ లో సంచలన కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం వల్ల కంప్లీట్‌గా వాషౌట్ అయిన తర్వాత శాస్త్రి రియాక్ట్ అవుతూ వైభవ్‌ను ఆడించకపోవడం పెద్ద తప్పు అని చెప్పాడు. "ఆ పిల్లాడిని ఐర్లాండ్ తోనే ఆడించాల్సింది . అది చాలా స్లో అండ్ స్పాంజీ ట్రాక్, పైగా గ్రౌండ్ కూడా చాలా చిన్నది. అక్కడ గనక వైభవ్ ఆడి ఉంటే బాల్స్ అన్నీ స్టేడియం టెర్రస్ పై పడేవి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ బౌలర్ల ప్యాంట్లు ఊడదీసి వదిలేసేవాడు. అతనికి వీలైనంత త్వరగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఛాన్స్ ఇవ్వాలి" అని శాస్త్రి చాలా బోల్డ్ గా అన్నాడు.

గంభీర్ మార్క్ రూల్స్.. భవిష్యత్తు సిరీస్ లపైనే అందరి కళ్లుటీమిండియా థింక్ ట్యాంక్, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ వేర్వేరు అంచనాలతో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గౌతమ్ గంభీర్ లీడర్‌షిప్ లో ఇండియా ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది కాబట్టి అతను క్రియేట్ చేసిన సిస్టమ్ ను అంత ఈజీగా బ్రేక్ చేయలేరు. ఐపీఎల్ లో 230 కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన వైభవ్, శ్రీలంకలో ఇండియా-A తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 రన్స్ కొట్టి తన పవర్ ఏంటో చూపించాడు. గంభీర్ సక్సెస్ ఫుల్ ఫార్ములాను నమ్ముకుని సీనియర్లకే ఓటు వేస్తున్నా రాబోయే మ్యాచుల్లోనైనా రొటేషన్ పాలసీ ద్వారా ఈ 15 ఏళ్ల రికార్డ్ మేకర్ కు డెబ్యూ క్యాప్ దక్కుతుందా లేదా అనేది ప్రెజెంట్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని తెలుస్తోంది.