Under-19 World Cup IN Super Six Stage: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. మంగళవారం నుంచి సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్‌ సిక్స్‌లో భాగంగా 16 జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసే సరికి గ్రూప్‌-ఏలో భారత్‌ మూడు మ్యాచుల్లో మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ రెండు విజయాలతో రెండో స్థానంలో, ఐర్లాండ్‌ ఒక విజయంతో మూడు, అమెరికా మూడు ఓటములతో నాలుగో స్థానంలో కొనసాగింది. గ్రూప్‌-బిలో రెండేసి విజయాలతో దక్షిణాఫ్రికా మొదటి, ఇంగ్లాండ్‌ రెండు, వెస్టిండీస్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. స్కాట్లాండ్‌ జట్టు మూడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది.


గ్రూప్‌-సిలో మూడు విజయాలతో టాప్‌లో నిలువగా, శ్రీలంక రెండు విజయాలతో రెండు, జింబాబ్వే ఒకే ఒక్క విజయంతో మూడు, నమీబియా మూడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్‌-డిలో మూడు విజయాలతో పాక్‌ అగ్రస్థానంలో నిలువగా, రెండు విజయాలతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో, నేపాల్‌ ఒకే ఒక్క విజయంతో మూడో స్థానంలో, అప్ఘనిస్తాన్‌ మూడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. 


సూపర్‌ సిక్స్‌లో తలపడే జట్లు ఇవే


అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భాగంగా సూపర్‌ సిక్స్‌లో 16 జట్టు తలపడనున్నాయి. ఈ నెల 30 నుంచి సూపర్‌ సిక్స్‌ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ రెండు మ్యాచులు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌ లో శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, మూడో మ్యాచ్‌లో ఇండియా-న్యూజిలాండ్‌, నాలుగో మ్యాచ్‌లో అమెరికా, అప్ఘనిస్థాన్‌, ఐదో మ్యాచ్‌లో నేపాల్‌-బంగ్లాదేశ్‌, ఆ తరువాతి మ్యాచ్‌లో జింబాబ్వే-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఏడో మ్యాచ్‌లో ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్‌ జట్టు, ఎనిమిదో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌-నమీబియా జట్లు తలపడనున్నాయి. 


ఆరో తేదీన సెమీ ఫైనల్‌


సూపర్‌ సిక్స్‌లో టాప్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టనున్నాయి. ఫిబ్రవరి ఆరో తేదీన తొలి సెమీ ఫైనల్‌ జరగనుంది. ఎనిమిదో తేదీన రెండో సెమీఫైనల్‌, ఫైనల్‌ ఫిబ్రవరి 11న జరగనుంది. ఇందుకోసం క్రికెట్‌ దక్షిణఫ్రికా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 19న ప్రారంభమైన అండర్‌-19 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు.. వచ్చే నెల 11తో ముగియనున్నాయి. ఇకపతే, టైటిట్‌ పేవరెట్స్‌గా బరిలోకి దిగిన భారత్‌, ఆస్ర్టేలియా జట్లు అంచనాలకు మించి రాణిస్తుండగా, హోమ్‌ గ్రౌండ్‌ అడ్వాంటేజీతో దక్షిణాఫ్రికా కూడా మెరుగైన ప్రదర్శనతో అదరగొడుతోంది. ఇంగ్లాండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్టు కూడా అంచనాలకు మించి రాణిస్తూ టైటిల్‌ రేసులో కొనసాగుతున్నాయి.