Jadeja, Rahul ruled out of Vizag Test:  హైదరాబాద్‌(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఓడి షాక్‌లో ఉన్న టీమిండియా(Team India)కు మరో షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), కె.ఎల్‌.రాహుల్‌(KL Rahul) దూరమయ్యారు. గాయాల కారణంగా రెండో టెస్టుకు జడేజా, రాహుల్‌ తప్పుకున్నారు. రాహుల్‌, జడేజా ఇద్దరి స్థానంలో ముగ్గురిని భారత జట్టులో సెలక్షన్ కమిటీ చేర్చింది. సర్ఫరాజ్‌ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు జట్టులో చోటు కల్పించింది. ఎన్నో ఏళ్ల నుంచి టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు చివరికి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో భారత్‌- ఇంగ్లండ్‌ రెండో టెస్టు జరగనుంది.

 

తొలి టెస్ట్‌ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో స్టార్‌ ఆటగాడు రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను రనౌట్‌ కావడమే కాకుండా రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా మారాడు. జడేజా గాయం తీవ్రతపై ఇవాళ అధికారిక ప్రకటన వడింది. నిన్న మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ మీట్‌లో ఈ విషయంపై ఎదురైన ప్రశ్నల గురించి స్పందించేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నిరాకరించాడు.

 


తొలి టెస్ట్‌ చేజారిందిలా..
తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్‌లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. రూట్‌ 39(60), బెయిర్‌ స్టో 37(58) పరగులు చేశారు. ఆ తరువాత వచ్చిన స్టోక్స్‌ కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించి పెట్టాడు. 88 బంతులు ఆడిన స్టోక్స్‌ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు సహాయంతో 70 పరుగులు చేశాడు. టెయిలెండర్లలో టామ్‌ హార్టిలీ 24 బంతుల్లో 23 పరుగులు, చేయగా, మార్క్‌ వుడ్‌ 24 బంతుల్లో 11 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అక్షర్‌ పటేల్‌ రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, అశ్విన్‌ మూడేసి వికెట్లు తీసి సత్తా చాటారు.



తొలి ఇన్సింగ్‌లో భారత్‌ బ్యాటర్లు అదరగొట్టడంతో భారీ ఆధిక్యం లభిచింది. తొలి ఇన్సింగ్‌లో 121 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన భారత ఆటగాళ్లు 436 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్సింగ్‌లో భారత్‌కు 190 పరుగులు ఆధిక్యం లభించింది. , రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఒల్లీ పోప్‌ 278 బంతుల్లో 21 ఫోర్లు సహాయంతో 196 పరుగులు చేసి తుది వరకు నిలిచి జట్టు మెరుగైన స్కోర్‌ చేసేందుకు దోహదం చేశాడు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌ విజంభణతో ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమవుతుందని భావించారు. కానీ పోప్‌ పట్టువదలని విక్రమార్కుడిలా భారత్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించిపెట్టాడు. 420 పరుగులకు రెండో ఇన్సింగ్‌ను ఇంగ్లాండ్‌ జట్టు ముగించింది. దీంతో టీమిండియా ముందు ముగిసిన మొదటి టెస్టులో ఆ జట్టు 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది.