Team Indias T20 World Cup 2024 Jersey Launched In Dharamshala : వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team Indias Jersey) ని ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్, కిట్ స్పాన్సర్ అడిడాస్ అధికారికంగా విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఈ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్‌గా అడిడాస్ వ్యవహరిస్తుంది. ఈ కొత్త జెర్సీ.. నీలం, కాషాయం రంగులు కలగలిపి ఉంది. ఈ కొత్త జెర్సీని నీలం, కాషాయం రంగులో ఉన్నాయి. వీడియోలో కొత్త ఇండియా కిట్‌తో ఓ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగురుతుండగా.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చుస్తున్నారు. జెర్సీలో భుజాలు నారింజ రంగులో ఉండగా.. మిగిలిన భాగం నీలం రంగులో ఉంది. ఇక అడిడాస్ ఐకానిక్ మూడు చారలు తెలుపు రంగులో భుజాలపై ఉన్నాయి. ఈ జెర్సీలు మే 7 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటాయని అడిడాస్ పేర్కొంది. అయితే అధికారికంగా అడిడాస్ జెర్సీని ప్రకటించకముందే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన జెర్సీ ఫొటోలు లీక్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. వన్ జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 అంటూ బీసీసీఐ పోస్ట్ చేసింది.
గతంలో పూర్తి బ్లీడ్ బ్లూ ఉన్న జెర్సీకి కొంచెం ఆరెంజ్ టచ్ ఇచ్చారు ఈసారి. ఈ జెర్సీ రంగులపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ రంగుతో మార్కెట్ లో జెర్సీలు వచ్చేశాయని కొందరు..సర్ఫ్ ఎక్సెల్ కలర్ అని, పెట్రోల్ బంక్ లో పనిచేసేవాళ్లలా ఉన్నారని మరికొందరు ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు
భారత్ వేట అప్పటినుంచే..?
జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.
టీ 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
ఉగ్రముప్పు
మెగా ఈవెంట్ కు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ టోర్నీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టోర్నమెంట్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్ ఒక్కటే కాదు దానితో సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు సమాచారం. ఐఎస్‌కి చెందిన మీడియా గ్రూప్ ‘నాషీర్ పాకిస్థాన్’ ద్వారా ప్రపంచకప్‌కు ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారం అందిందని కరీబియన్ మీడియాలో వార్తలు వచ్చాయి.