Team India: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, కొత్త కుర్రాడికి ఛాన్స్

Rohit Sharma News | బంగ్లాదేశ్, భారత్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది.

Continues below advertisement

Team Indias squad announced for 1st Test against Bangladesh | ఢిల్లీ: త్వరలో భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాను ప్రకటించింది. అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి టెస్టుకు ఆదివారం (సెప్టెంబర్ 8న) జట్టును ప్రకటించింది.

Continues below advertisement

భారత జట్టు (Team India Squad)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్

కొత్త కుర్రాడికి ఛాన్స్ లభిస్తుందా?
దులీప్ ట్రోఫీలో రాణించిన ఆకాశ్ దీప్ టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా ఏ బౌలర్ ఆకాశ్ దీప్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతం చేశాడు. బౌలింగ్ లో 9వికెట్లతో రాణించిన ఆకాశ్ దీప్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ లో 42 బంతుల్లో 43 పరుగులు చేసిన ఆకాశ్ దీప్ రనౌటయ్యాడు.  తుది జట్టులో ఆకాశ్ దీప్ నకు ఛాన్స్ దొరుకుతుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడక తప్పదు.

 

 

 

Continues below advertisement