Team India Victory Parade Highlights: ఒక క్రికెటర్‌గా ఆటగాళ్లు... క్రికెట్‌ను అభిమానించి ప్రేమించే వారిగా అభిమానులకు వాంఖడే స్టేడియం జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని క్షణాలను అందించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆటగాళ్లు భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యాను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రసంగించాడు. ప్రపంచకప్ పైనల్లో ఆ ఓవర్ వేయడానికి చాలా ఒత్తిడి ఉంటుందని.. కానీ పాండ్యా దానిని సమర్థంగా నిర్వహించాడని.. పాండ్యాకు హ్యాట్సాఫ్ అని హిట్ మ్యాన్ అన్నాడు. రోహిత్ ప్రసంగం చేస్తున్నప్పుడు హార్దిక్ లేచి నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
భారతే తనకు ప్రపంచమని... ఈ ప్రేమను అందించిన వారందరికీ ధన్యవాదాలని టీమిండియాకు ప్రపంచకప్ రావడంలో కీలకపాత్ర పోషించిన నెంబర్ వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ విజయోత్సవాన్ని తమతో జరుపుకోవడానికి వచ్చిన వారందరికీ పాండ్యా ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి ఘన స్వాగతం ఎప్పుడూ చూడలేదని.. ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్‌లో ఇదే అత్యంత మధురమైనదని విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ బుమ్రాను ప్రశంసించాడు. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ తరానికి ఒకడే ఉంటాడని విరాట్ అన్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రాను ఎదుర్కోవడం ఈ ప్రపంచంలో ఏ బ్యాటర్‌కు అయినా కష్టమేనని కింగ్ కోహ్లీ అన్నాడు. బుమ్రా ప్రపంచంలో ఎనిమిదో వింతని కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు. టీ 20 ప్రపంచకప్ జారిపోతుందని అనుకున్నామని... కానీ చివరి ఐదు ఓవర్లలో అద్భుతం జరిగిందని కోహ్లీ అన్నాడు.ఈ మ్యాచ్‌తో టీ 20 క్రికెట్‌లో తన ప్రస్థానం ముగిసిందని.... కానీ ఈ విజయం తనకు చివరిదాకా గుర్తిండిపోతుందని కోహ్లీ అన్నాడు. చివరి ఐదు ఓవర్లలో బుమ్రా అద్భుతం చేశాడని.. బూమ్ బూమ్ బూమ్ రా అంటూ కోహ్లీ కామెంట్ చేశాడు.
మైదానంలో రోహిత్ ఇంత భావోద్వేగాన్ని ప్రదర్శించడం తాను తొలిసారి చూశానని.. అదొక ప్రత్యేక క్షణమని కోహ్లీ అన్నాడు.
ద్రావిడ్ ఏమన్నాడంటే...
విశ్వ విజేతలుగా నిలిచిన ఈ జట్టు ఒక కుటుంబం లాంటిదని...జట్టులోని ఆటగాళ్లు నమ్మశక్యం కానీ ఓ అద్భుతం చేశారని రాహుల్ ద్రావిడ్ అన్నాడు. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దన్న నినాదాన్ని ఆటగాళ్లు అమలు చేశారని మిస్టర్ డిపెండబుల్ అన్నాడు.
ఇలాంటి జట్టుకు నాయకత్వం వహించడం తన అదృష్టమన్న రోహిత్ శర్మ తాము భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కలలో కూడా ఊహించని ఘటనలు జరిగాయాని అన్నాడు. ఈ ట్రోఫీ కేవలం మాది మాత్రేమే కాదని యావత్ దేశానిదని రోహిత్ శర్మ అన్నాడు.
ఏ పాటకు డ్యాన్స్ అంటే
ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని వాంఖడేలో నిర్వహించిన విజయ్ పరేడ్ తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో భారత క్రికెట్ ఆటగాళ్లు దేశీ పాటలకు నృత్యం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, అవుట్‌గోయింగ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బుమ్రా ఇలా ప్రతీ ఒక్కరూ ఈ స్వాగతానికి భావోద్వేగానికి గురయ్యారు.