Team India Squad: సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీం ఇండియాను ప్రకటించారు. తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు విశ్రాంతిని ఇచ్చారు. జట్టు కెప్టెన్సీ కేఎల్ రాహుల్ చేతిలో ఉంటుంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రానున్నారు.
ప్రపంచకప్ వంటి పెద్ద ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, మొదటి రెండు వన్డేల నుంచి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో పాటు వరల్డ్‌కప్‌లో టీమిండియాలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్షర్ పటేల్ గాయం కారణంగా సెలక్టర్లు రీప్లేస్‌మెంట్ చూడాలి. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. అందువల్ల ఈ ఇద్దరు ఆటగాళ్లను మూడు వన్డేలకు జట్టులో ఉంచారు. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌ల్లో ఒకరికి ప్రపంచకప్ బెర్త్ దక్కే అవకాశం ఉంది.
దీంతో పాటు తొలి రెండు వన్డేల జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కూడా తొలి రెండు వన్డేలకు జట్టులో ఉన్నారు. అయితే మూడో వన్డేలో ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుతో ఉండరు. సంజూ శామ్సన్‌ను ఏ మ్యాచ్‌కూ ఎంపిక చేయలేదు. దీన్ని బట్టి సంజూ శామ్సన్‌కు టీమిండియా తలుపులు మూసుకుపోయాయని స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో తొలి వన్డే సెప్టెంబర్ 22వ తేదీన, రెండో వన్డే సెప్టెంబర్ 24వ తేదీన జరగనుంది. సిరీస్‌లో మూడో, చివరి వన్డే సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించనున్నారు.
తొలి రెండు వన్డేలకు జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ , ప్రసిధ్ కృష్ణ, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
మూడో వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. , కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial