T20 World Cup 2024  England Squad and New Zealand squad:  ఐపీఎల్‌(IPL) ముగిసిన వెంటనే టీ 20 ప్రపంచకప్‌(t20 World Cup) ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌లో తుది మెట్టుపై బోల్తాపడిన భారత జట్టు... పొట్టి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలన్న పట్టుదలతో ఉంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 15మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించారు. సీనియర్లు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును అగార్కర్‌ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ ప్రపంచకప్‌లో మిగిలిన జట్లు కూడా తమ టీమ్‌లను ప్రకటించాయి. అన్ని టీమ్‌లో వివిధ లీగుల్లో ఆడుతుండడంతో ఈసారి టీ 20 ప్రపంచకప్‌ మరింత రసవత్తరంగా మారనుంది. కరేబియన్‌ దీవులు సహా అమెరికాలో జరిగే ఈ ప్రపంచకప్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.


భారత టీ 20 జట్టు  :


రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ),సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), హార్దిక్  పాండ్య (వికెట్ కీపర్ ), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా,  ముహమ్మద్ సిరాజ్,


ట్రావెలింగ్ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌


ఇక మిగిలిన జట్లు ఇలా....


ఇంగ్లాండ్‌:  జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్. 


న్యూజిలాండ్‌ జట్టు: విలియమ్సన్‌, ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బ్రాస్‌వెల్‌, చాప్‌మన్‌, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డరిల్‌ మిచెల్‌, నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్ శాంట్నర్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ.


దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసి, ట్రిస్టన్ స్టబ్స్.


ట్రావెలింగ్ రిజర్వ్: నంద్రి బర్గర్, లుంగి ఎంగిడి. 



సరిగ్గా నెలరోజుల్లో....
జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.