T20 World Cup 2022 Group 2 Qualification Scenario: బాబోయ్ ఈ రేంజ్ టెన్షన్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ ఫేస్ చేసి ఉండదు. చూడ్డానికి ధీమాగానే కనిపించినా...ఏదన్నా తేడా జరిగిందా ఇంత టోర్నమెంట్ ఆడి టీమిండియా ఇంటికి  వెళ్లాల్సిందే. హా ఏముంది లే జింబాబ్వే నే కదా కొట్టేద్దాం అనుకుంటే...పాకిస్థాన్ ను వాళ్లు మట్టికరిపించిన తీరు మర్చిపోకూడదు.  అందుకే ఈ టెన్షన్. మూడు మ్యాచులున్నాయి. రెండు సెమీస్ బెర్తులున్నాయి. నాలుగు టీమ్ లు పోటీలో ఉన్నాయి. ఎస్ టెక్నికల్ గా బంగ్లాదేశ్ కు కూడా ఇంకా అవకాశాలున్నాయి. అసలు గ్రూప్ 2  లో సెమీస్ రేస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.


గ్రూప్-2లోనూ నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో టీమిండియా అగ్రస్థానంలో  ఉంది. మొత్తం ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరుపాయింట్లు సాధించింది ఇండియా. ఇక రెండో ప్లేస్ లో దక్షిణాఫ్రికా, మూడో ప్లేస్ లో పాకిస్థాన్, నాలుగో ప్లేస్ లో బంగ్లాదేశ్ ఉన్నాయి.  జింబాబ్వే, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. 


Scenario 1


మొదటి స్థానంలో ఉన్న టీమిడియా, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరతాయి. టీమిండియాకు ఎనిమిది పాయింట్లు, దక్షిణాఫ్రికా కు ఏడు పాయింట్లు వస్తాయి కాబట్టి. ఒకవేళ టీమిండియా ఓడిపోతే....


scenario 2


భారత్‌కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లలో ఓ జట్టు ఓడాలి. దక్షిణాఫ్రికాకి మ్యాచ్ జరిగేది నెదర్లాండ్స్ తో. పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది బంగ్లాదేశ్ తో. సో సౌతాఫ్రికా ఓడిపోవటం అనేది ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. సో మనం ఓడిపోతే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ పై ఆధారపడాలి. బంగ్లా దేశ్ తక్కువ తేడాతో పాకిస్థాన్ పై గెలిస్తే రన్ రేట్ పెద్ద మార్పు ఉండదు కాబట్టి..ఇద్దరికీ ఆరుపాయింట్లే ఉన్నా మనం సెమీస్ కు వెళ్లిపోతాం. అదే పాకిస్థాన్ గెలిస్తే...ఇప్పటికే నెట్ రన్ రేట్ ఎక్కువగా పాకిస్థాన్ మనల్ని ఇంటికి పంపించి సెమీస్ కు వెళ్తుంది. 


scenario 3


ఒక వేళ బ్యాడ్ లక్ కు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మీద ఓడిపోయిందనుకుందాం. అప్పుడు ఇండియా జింబాబ్వే మ్యాచ్ ఓడిపోయినా సెమీస్ కు వెళ్లిపోతుంది. మిగిలిన రెండో ప్లేస్ లో  బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ లో గెలిచిన వాళ్లు వెళ్తారు. బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్..పాకిస్థాన్ గెలిస్తే పాకిస్థాన్.


సో ఇలా ప్రెడిక్షన్స్ టేబుల్స్ తో పనిలేకుండా ఉండాలంటే ఇండియా జింబాబ్వే మీద గెలిస్తే చాలు. సెమీస్ కు రూటు సెట్టు.