ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 ప్రారంభ మ్యాచ్‌లో బాబర్ అజం నేతృత్వంలోని పాకిస్తాన్ టీం, భారత్‌తో తలపడటానికి సిద్ధం అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ మరోసారి బలహీనంగా ఉంది. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సందర్భంగా టాప్-ఆర్డర్ బ్యాటర్ ఫకార్ జమాన్ గాయం కారణంగా భారత్‌పై ఆడడని బాబర్ ఆజం ధృవీకరించాడు. అయితే షాన్ మసూద్ వారి బ్యాటింగ్ లైనప్‌‌కు బలం కాగలడు. అయితే పరీక్షలను క్లియర్ చేయాల్సి ఉంది. బాబర్ ఫాం లేమితో బాధపడుతుండటంతో, వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ బ్యాట్‌తో బాధ్యత తీసుకున్నాడు. మిడిల్ ఆర్డర్ పాక్‌కు కష్టాలను తెచ్చిపెట్టనుంది.


భారత్‌పై పాకిస్థాన్ అంచనా తుదిజట్టు ఇదే
బాబర్ ఆజం: ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతని ఫామ్ క్షీణించింది. మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే అతని పాత్ర కీలకం.


మహ్మద్ రిజ్వాన్: ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ టీ20 బ్యాటర్. రిజ్వాన్ గత రెండేళ్లుగా బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. బాబర్‌తో అతని భాగస్వామ్యం పాకిస్తాన్‌కు కీలకం. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఆందోళనల కారణంగా.


షాన్ మసూద్: గత నెలలో జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుంచి కొన్ని షాన్ మసూద్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వాటిని షాన్ పునరావృతం చేయగలడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.


ఆసిఫ్ అలీ: ప్లేయింగ్ XIలో ఖుష్దిల్ షాతో పోరాడే ముందు ఇతను వచ్చే అవకాశం ఉంది. అయితే ఇతని ప్రదర్శనలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి మాత్రం మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు.


ఇఫ్తికార్ అహ్మద్: జట్టులో అతని స్థానం గురించి చాలా చర్చలు జరిగాయి. ఇఫ్తికార్ కొన్ని మంచి కామియో ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే అతని స్ట్రైకర్-రేట్ ఆందోళనకరంగా ఉంది.


మహ్మద్ నవాజ్: నవాజ్ ఇటీవలి ఫామ్ పాకిస్తాన్‌కు సానుకూలాంశాలలో ఒకటి. నవాజ్ కష్టమైన క్షణాల్లో బంతిని బలంగా కొట్టే సామర్థ్యంతో ఉంది. అవకాశం వస్తే బాల్‌తో కూడా మాయ చేయగలడు.


షాదాబ్ ఖాన్: భారత్‌తో జరిగే కీలక పోరులో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ మరో ప్రభావవంతమైన ఆటగాడు. అతని లెగ్ స్పిన్ కాకుండా, బ్యాట్‌తో కూడా ప్రభావం చూపగలడు.


మహ్మద్ వసీం జూనియర్: పాకిస్తాన్ తమ బౌలింగ్‌కు మరింత శక్తిని జోడించాలని చూస్తున్నందున, ప్లేయింగ్ XIలోని నలుగురు పేసర్‌లలో వాసిమ్ ఒకడు కావచ్చు. అతను బంతితో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అవకాశం వచ్చినట్లయితే కొన్ని భారీ షాట్లు కూడా కొట్టగలడు.


షహీన్ అఫ్రిది: ప్లేయింగ్ XIలో షహీన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ గేమ్‌లో షహీన్ బలమైన పునరాగమనం చేశాడు. అక్కడ అతను తన ప్రభావం చూపాడు. కొత్త బంతిని అతను విసిరినంత ప్రభావవంతంగా ఎవరూ విసరలేరు.


హారిస్ రౌఫ్: షహీన్ కొత్త బాల్‌తో ఎక్స్-ఫాక్టర్ అయితే, హారిస్ మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడు. అతని ఎకానమీ రేటు కూడా చాలా ఆకట్టుకుంటుంది.


నసీమ్ షా: షహీన్ లేకపోవడంతో, ఆసియా కప్ సమయంలో పేస్ బౌలింగ్ బాధ్యతను నసీమ్ తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్ నుంచి అతను తుదిజట్టులో సిర్థమైన స్థానాన్ని ఆశిస్తున్నాడు.