Lanka Cricketer Works as a Bus Driver: ఇండియాలో క్రికెటర్ గా జాతీయ జట్టులో స్థానం సంపాందించి, పదులు సంఖ్యలో మ్యాచ్ లు ఆడితే లైఫ్ సెటిల్ అయినట్లే. బీసీసీఐ ఇచ్చే పెన్షన్తో పాటు వివిధ రకాలుగా లీగ్ లు, క్రికెట్ సంబంధింత అంశాలలో అవకాశాలు లభిస్తాయి. అదే వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్ ఆడితే అతడికి ఒక రేంజ్ ఉటుంది. కనీసం కామెంటేటర్ గా అయినా బాగా గిరాకీ ఉంటుంది. అయితే ఇండియాలో ఉన్నట్లుగా క్రికెటర్లకు లైఫ్ సెటిల్ మెంట్ లేకపోవడం దురదృష్టకరం. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన కూడా కొంతమంది క్రికెటర్లు బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు.. శ్రీలంకకు చెందిన సూరజ్ రణదీవ్.. ఇండియాలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తను తుదిజట్టులో ఆడాడు. ఆ తర్వాత కొంతకాలానికి తెరమరుగయ్యాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం దుర్భరంగా ఉంది. దేశంకానీ దేశంలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ పొట్ట పోసుకుంటున్నాడు. అతడి గత చరిత్ర తెలిసిన కొంతమంది ముక్కున వేలేసుకుంటున్నారు. క్రికెటర్ల రక్షణ కోసం పని చేయని లంక క్రికెట్ బోర్డును తిట్టుకుంటున్నారు.
ఆస్ట్రేలియాలో పని..మెల్ బోర్నలో ఒక సంస్థలో బస్సు డ్రైవర్ గా రణదీవ్ పని చేస్తున్నాడు. అతను ఒకట్రెండు మ్యాచ్ లు ఆడిన అనామక క్రికటరేం కాదు. లంక తరపున సరిగ్గా 50 మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడిన ఘనాపాఠి. అలాంటి క్రికెటర్ కు ఇప్పుడు ఈ దుస్థితి పట్టిందని క్రికెట్ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో సహచర క్రికెటర్ చింతక జయసింఘేతోపాటు ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా లంక ఆర్థిక పరిస్థితి చితికి పోవడంతో చాలామంది క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక రణదీవ్ విషయానికొస్తే పుట్టుకతో తను మహ్మదీయుడు. తన పూర్తి పేరు మహ్మద్ సూరజ్ కాగా, లంకలో బౌద్ధమత ప్రభావంతో తను బౌద్ధునిగా మారడు. అలా అతని పేరు సూరజ్ రణధీవ్ గా మారింది.
కివీస్ నుంచి కూడా..న్యూజిలాండ్ నుంచి ఇలా ఒక క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత కనుమరుగయ్యాడు. అతను మరెవరో కాదు... క్రిస్ కెయిర్న్స్. ఇతను న్యూజిలాండ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. కివీస్ తరపున 279 అంతర్జాతీయ మ్యాచ్ లాడిన క్రిస్.. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. ఓవరాల్ గా 8వేలకు పైగా పరుగులు, 420 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో చిక్కి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఓడించి కివీస్ విజేతగా నిలవడంలో కేయిర్న్స్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో సెంచరీతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయితే ఇప్పుడు అతని పరిస్థితి ఘోరంగా ఉంది. కొన్నాళ్లుగా బస్ డ్రైవర్ తోపాటు క్లీనర్ గానూ పని చేసిన కెయిర్న్స్ తాజాగా కేన్సర్ బారిన పడ్డాడు. సో.. అంతర్జాతీయంగా మెరిసిన క్రికెటర్ల జీవితాలు పూలపాన్పు కాదు.. అక్కడక్కడ రోజువారి జీవితానికి కూడా యుద్ధం చేయాల్సిన పరిస్తితులు ఉంటాయి.
Read Also: Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్