ICC Champions Trophy 2025 Updates: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లకు ఎంత క్రేజే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త‌వారం ఇరుజ‌ట్ల మ‌ద్య దుబాయ్ లో జ‌రిగిన పోరుకు స్టేడియం ఫుల్ కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల్లో ఈ మ్యాచ్ ల‌ను తిల‌కించారు. అయితే అడ‌పాద‌డ‌పా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ ల‌కు ఇంత క్రేజ్ ఉండ‌గా, ఇరుజ‌ట్ల మ‌ధ్య (India vs Pakistan) ద్వైపాక్షిక సిరీస్ లు జ‌రిగితే ఈ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నిజానికి ఒక టెస్టు మ్యాచ్ కు అత్య‌ధిక మంది హాజ‌రైన రికార్డ్ దాయాది దేశాల పేరిటే ఉంది .1999లో కోల్క‌తా ఈడెన్ గార్డ్సెన్స్ లో జ‌రిగ‌న మ్యాచ్ కు ల‌క్ష‌లాది మంది హాజ‌ర‌య్యారు. 26 ఏళ్లు గ‌డిచిన ఆ రికార్డు ఇంకా చెదిరి పోలేదు. అయితే ద్వైపాక్షిక సిరీస్ ను పున‌రుద్ధ‌రించ‌డంపై మాజీ కెప్టెన్ సునీల్ గావ‌స్క‌ర్ సూచ‌న చేశాడు. ఆ విధంగా చేస్తే ఇరు దేశాల మ‌ధ్య తిరిగి బైలేటర‌ల్ సిరీస్ లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నాడు. 

చొర‌వ అవ‌స‌రం.. 2012లో చివ‌రిసారిగా దాయాదుల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగింది. ఆ త‌ర్వాత గ‌త 13 ఏళ్లుగా ఎలాంటి సిరీస్ జ‌ర‌గ‌డం లేదు. ఇరుదేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల‌తోనే సిరీస్ లు జ‌ర‌గ‌డం లేదు. ముఖ్యంగా సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ప్రొత్స‌హిస్తుండ‌టంతోనే పాక్ తో ద్వైపాక్షిక సంబంధాల‌ను తెంచుకున్నామ‌ని బీసీసీఐ తెలిపింది. ఉగ్రావాదానికి స్వ‌స్తి ప‌లికి, స‌రిహ‌ద్దుల్లో శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంటేనే బైలేటేర‌ల్ సిరీస్ కు అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని పేర్కొంటున్నాడు. అయితే ఇప్ప‌టికే ద్వైపాక్షిక సిరీస్ ల పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నా, పైన చెప్పింది జ‌ర‌గ‌కుంటే ఫ‌లితం ఉండ‌బోద‌ని పేర్కొన్నాడు. 

ఏక‌ప‌క్షంగా పోరు..ఇక గ‌త కొంత‌కాలంగా పాక్ ప్ర‌మాణాలు నానాటికీ దిగాజ‌రుతున్నాయి. ప‌సికూన‌ల చేతిలోనూ ఓడిపోతూ ప‌రాభ‌వం పాల‌వుతోంది. 2017 చాంపియ‌న్స్ ట్రోఫీ నెగ్గాక‌, మ‌రే ఐసీసీ టోర్నీని నెగ్గ‌లేదు. 2022 టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌లే అత్యుత్త‌మ ప్ర‌దర్శ‌న కావ‌డం విశేషం. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే మ‌రీ తీసిక‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. 2017 త‌ర్వాత ఆడిన ఆరు వ‌న్డేల్లో ఐదింటిలో ఓడిపోగా, ఒక మ్యాచ్ ర‌ద్ద‌య్యింది. ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌తో కేవ‌లం ఐసీసీ, ఆసియాక‌ప్ లాంటి మ‌ల్టీ నేష‌న్ టోర్నీలోనే ఇరుజ‌ట్లు ఆడుతున్నాయి.

ఈ ఏడాది ఆసియాక‌ప్ ను భార‌త్ నిర్వ‌హించ‌నుంది. ఇందులో భార‌త్, పాక్ జ‌ట్లు మ‌రోసారి ఢీకొంటాయి. అయితే ఈ మ్యాచ్ ను త‌ట‌స్థ వేదిక‌పై నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది. శ్రీలంక లేదా యూఏఈ ఆతిథ్య‌మిచ్చే చాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జ‌రుగుతున్న ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ లో హైబ్రీడ్ మోడ‌ల్లో భార‌త్ ఆడుతోంది. అంటే టోర్నీ నిర్వ‌హిస్తున్న పాక్ లో  కాకుండా, దుబాయ్ లో మ్యాచ్ ఆడుతుంది. ఆసియాకప్ లో పాక్ కూడా ఇలాగే ఆడ‌నుంది. ఐసీసీ సమక్షంలో ఈ ఒప్పందం జరగడం విశేషం. 

Read Also: Viral Video: టీమిండియాకి గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న స్పీడ్ స్ట‌ర్ బుమ్రా.. తాజా వీడియో వెలుగులోకి..