Angelo Mathews And Dinesh Chandimal: శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగిసే సరికి మొదటి ఇన్నింగ్స్‌లో లంకేయులు 127పరుగులు వెనకుబడి ఉంది. ఏంజెలో మాథ్యూస్ ఈ టెస్టు సిరీస్ తర్వాత రిటైర్ కాబోతున్నాడు. అందుకే శ్రీలంక టీం ఈ టెస్టు సిరీస్‌ను చాలా ఎమోషన్‌తో ఆడుతోంది.
ఇవాళ శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే బిగ్ షాక్ తగిలింది. లాహిరు ఉదర వికెట్‌ను కేవలం 41 పరుగుల వద్ద లంక కోల్పోయింది. పాతుం నిస్సంకకు దినేష్ చండీమల్ అండగా నిలబడ్డాడు. ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుదురుగా ఆడుతూ నిస్సంకా సెంచరీ చేస్తే దినేష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక స్ట్రాంగ్ అవుతున్న క్రమంలోనే నయీం హాసన్ పెద్ద దెబ్బ తీశాడు. దినేష్‌ను బోల్తా కొట్టించాడు. 119 బంతులు ఎదుర్కొన్న దినేష్ 54 పరుగులు చేశాడు. అతని తర్వాత ఏంజెలో మాథ్యూస్ వచ్చి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ నిస్సంకా మాత్రం వెనక్కి తగ్గలేదు. 150 పరుగులు చేశాడు.
ఇలా నిస్సంక, మాథ్యూస్ మధ్య భారీ భాగస్వామ్యం నమోదు అవుతున్న క్రమంలో బంగ్లాదేశ్ మరో దెబ్బ తీసింది. 293 పరుగుల వద్ద మాథ్యాస్‌ను మొమినల్ హక్ బోల్తా కొట్టించాడు. దీంతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాథ్యాస్ భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత నిస్సంకను కూడా హాసన్ మహ్మద్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మెండీస్, ధనంజయ్ డి సెల్వా ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంకా 127 పరుగుల వెనుకబడి ఉంది. బంగాదేశ్ తరఫున బౌలర్లు నహీద్ రానా మినహా మిగిలిన బౌలర్లు చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 484 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. హాసన్ మహ్మద్, నహిద్ రానా క్రీజ్‌లో ఉన్నారు. రెండ ఓవర్ల తర్వాత శ్రీలంక బౌరల్ ఫెర్నాండో రానాను అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 153 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 495 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో నజ్ముల్ హుసేన్, శాంటో ముజ్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ అద్భుతంగా రాణించడంతో ఫైటింగ్ స్కోర్‌ను శ్రీలంక ముందు ఉంచగలిగారు.
నజ్ముల్ హుసేన్‌శాంటో 148 పరుగులు, ముజ్ఫికర్ రహీమ్ 163 పరుగులు చేశాడు. లిట్టన్ దాస్ మరోసారి తన సెంచరీని మిస్ అయ్యాడు. 90 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. ఈ ముగ్గురు మినహా మిగతా బంగ్లా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. శ్రీలంక బౌలర్లో అసితా ఫెర్నాండో నాలుగు వికెట్లు తీసుకుంటే, మిలన్ రత్నాయకే, తరిందు రత్నాయకే చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.