ద‌క్షిణాఫ్రికా(South African)స్టార్‌ పేస‌ర్ క‌గిసొ ర‌బాడ(Kagiso Rabada) అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన బౌల‌ర్‌(completed 500 wickets in international cricket)గా రికార్డు సృష్టించాడు. సెంచూరియ‌న్( Centurion) వేదిక‌గా భార‌త్‌తో ఆరంభ‌మైన మొద‌టి టెస్టు మ్యాచులో రబాడ ఈ ఘ‌న‌త‌ సాధించాడును. ఈ క్రమంలో ద‌క్షిణాఫ్రికా త‌రుపున అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌల‌ర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్యర్‌, ర‌విచంద్రన్ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియ‌న్‌కు పంపిన‌ ర‌బాడ 5 వికెట్ల‌తో టీమ్ఇండియా(Team India) పతనాన్ని శాసించాడు.

 

101 వ‌న్డేల్లో 157 వికెట్లు, 56 టీ20ల్లో 58 వికెట్లు తీసిన ర‌బాడ 61 టెస్టుల్లో 285 వికెట్లు సాధించాడు. మొత్తంగా 218 ఇన్నింగ్స్‌ల్లో 500 వికెట్ల ఘ‌న‌త‌ను అందుకున్నాడు. స‌ఫారి బౌల‌ర్ల జాబితాలో డేల్ స్టెయిన్ (182), అలాన్ డొనాల్డ్ (196), మ‌ఖాయ ఎంతిని (213) లు ర‌బాడ క‌న్న త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.

 

దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన‌ బౌల‌ర్లు..

షాన్ పొలాక్ –829 వికెట్లు

డేల్ స్టెయిన్ – 699

మ‌ఖాయ ఎంతిని – 662

అలాన్ డోనాల్డ్ – 602

జాక్వెస్ కలిస్ – 577

మోర్నీ మోర్కెల్ – 544

కగిసో రబడ – 500*

 

అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన బౌల‌ర్లు..

రిచర్డ్ హ్యాడ్లీ –168 ఇన్నింగ్స్‌ల్లో

డేల్ స్టెయిన్ – 177

అలాన్ డోనాల్డ్ – 182

గ్లెన్ మెక్‌గ్రాత్ – 196

ఇయాన్ బోథమ్ – 197

మాల్కం మార్షల్ – 198

ట్రెంట్ బౌల్ట్ – 199

మిచెల్ స్టార్క్- 200

వకార్ యూనిస్ – 205

ఇమ్రాన్ ఖాన్ – 210

మ‌ఖాయ ఎంతిని – 211

బ్రెట్ లీ – 213

కర్ట్లీ ఆంబ్రోస్ – 217

కగిసో రబడ – 218

ఇక భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు రాణించారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు తొలి రోజే చాలా రంజుగా మొదలైంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్, స్టంప్స్ సమయానికి 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి రెండువందల ఎనిమిది పరుగులు చేసింది. వర్షం మరియు తడి ఔట్ ఫీల్డ్ వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే ఆఖరి సెషన్ లో కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఆట జరిగినంతసేపూ సౌతాఫ్రికా పేసర్లది, మరీ ముఖ్యంగా కగిసో రబాడదే ఆధిపత్యం. రబాడ 5 వికెట్ల ధాటికి ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. 24 పరుగులకే 3 వికెట్లు పోయినా,కోహ్లీ, శ్రేయస్ కాస్త నిలబడ్డారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ పతనం మొదలైంది. అప్పుడు ఆపద్బాంధవుడిలా వచ్చాడు... కేఎల్ రాహుల్. 24 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ తో 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో టెయిలెండర్లను నిలబెట్టి, స్కోరు 200 దాటించాడు. ప్రస్తుతం రాహుల్ 70 పరుగుల మీద ఉన్నాడు. క్రీజులో తోడుగా సిరాజ్ ఉన్నాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగటంతో, రేపు ఆట అరగంట ముందుగా ప్రారంభంకానుంది.