Ind vs SA 1st Test Day 1 Highlights: రంజుగా మొదలైన భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
స్టంప్స్ సమయానికి భారత్ స్కోర్ 208/8
ఐదు వికెట్లతో చెలరేగిన కగిసో రబాడ
కేఎల్ రాహుల్ 70* ఆపద్బాంధవుడి ఇన్నింగ్స్
భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు తొలి రోజే చాలా రంజుగా మొదలైంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్, స్టంప్స్ సమయానికి 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి రెండువందల ఎనిమిది పరుగులు చేసింది. వర్షం మరియు తడి ఔట్ ఫీల్డ్ వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే ఆఖరి సెషన్ లో కూడా వర్షం అంతరాయం కలిగించింది.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు తొలి రోజే చాలా రంజుగా మొదలైంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్, స్టంప్స్ సమయానికి 59 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి రెండువందల ఎనిమిది పరుగులు చేసింది. వర్షం మరియు తడి ఔట్ ఫీల్డ్ వల్ల ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే ఆఖరి సెషన్ లో కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఆట జరిగినంతసేపూ సౌతాఫ్రికా పేసర్లది, మరీ ముఖ్యంగా కగిసో రబాడదే ఆధిపత్యం. రబాడ 5 వికెట్ల ధాటికి ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. 24 పరుగులకే 3 వికెట్లు పోయినా,కోహ్లీ, శ్రేయస్ కాస్త నిలబడ్డారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ పతనం మొదలైంది. అప్పుడు ఆపద్బాంధవుడిలా వచ్చాడు... కేఎల్ రాహుల్. 24 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ తో 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో టెయిలెండర్లను నిలబెట్టి, స్కోరు 200 దాటించాడు. ప్రస్తుతం రాహుల్ 70 పరుగుల మీద ఉన్నాడు. క్రీజులో తోడుగా సిరాజ్ ఉన్నాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగటంతో, రేపు ఆట అరగంట ముందుగా ప్రారంభంకానుంది.
చెలరేగిన సఫారీ పేసర్లు, 24 రన్స్‌కే టీమిండియా 3 వికెట్లు
2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం నుంచి భారత్(Team India ), దక్షిణాఫ్రికా(Sout Africa) జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ మొదలైంది. సెంచూరియన్(Centurion Cricket Ground ) వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగా, టాస్ నెగ్గిన సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సెంచూరియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు మంచి ఆరంభం లభించ లేదు. యశస్వీ జైశ్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బంతితో నిప్పులు చెరిగాడు. రబాడ ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బంతికి రోహిత్ క్యాచౌట్ గా వెనుదిరిగాడు. ఆపై వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ కు దిగాడు. అంతలోనే మరో ఓపెనర్ ఔటయ్యాడు. నాండ్రీ బర్గర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (17) ఇచ్చిన క్యాచ్ ను కైల్ పట్టడంతో భారత్ 23 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.