2014 నుంచి ఏడేళ్లపాటు టీమిండియా(Team India) టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ(Virat Kohli)  2021లో అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం అందరికీ తెలిసినదే.  అత్యంత విజయంతమైన భారత కెప్టెన్‌గా పేరు ఉన్న రన్‌ మెషీన్‌ ఆకస్మాత్తుగా పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న  తర్వాత టెస్ట్  కెప్టెన్సీ నుం​చి పూర్తిగా వైదొలిగాడు. అంతే  కాదు తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనను తప్పించడంలో నాటి బీసీసీఐ(BCCI) బాస్‌ గంగూలీ(Sourav Ganguly)  కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్‌ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన కోహ్లీ.. టెస్ట్ కెప్టెన్సీని కూడా వదిలేసాడు.  తరువాత కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కారని సమాచారం.  ఐపీఎల్‌ 2023 (IPL)సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్‌ శర్మ(Rohit Sharma)  టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 


విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దాదాగిరి అన్‌లిమిటేడ్ సీజన్ 10 అనే రియాల్టీ షో‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు.  ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానన్నాడు. టీ20‌ల్లో కెప్టెన్‌గా కొనసాగేందుకు కోహ్లీ  అనాసక్తిని ప్రదర్శించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగలేనప్పుడు.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానన్నాడు.  కేవలం టెస్ట్‌ల్లో మాత్రమే సారథ్యం చేయమని చెప్పాను.  అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు.  అలాగే విరాట్ స్థానంలో భారతజట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోడానికి మొదట్లో రోహిత్ శర్మ అంతగా ఆసక్తి చూపలేదని, తానే బలవంతంగా ఒప్పించానని సౌరవ్ గుర్తు చేసుకొన్నారు.అయితే భారతజట్టు కు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఉండటానికి రోహిత్ ఏమాత్రం ఇష్టపడలేదని కానీ తాను పదేపదే చర్చించి, ఒప్పించానని, తన మాటను రోహిత్ మన్నించడం తనను గౌరవించడం లాంటిదేనని సౌరవ్ తెలిపారు.  బీసీసీఐ ప్రెసిడెంట్ గా అది తన బాధ్యత అని, టీమిండియా భవిష్యత్తు కోసమే చేశానని వివరించారు.  అలాగే టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) ముగిసేంత వరకు అన్ని ఫార్మాట్స్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండాలని తాను కోరుకుంటున్నానని  సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.  అయితే ఎన్ని చేసినా క్రికెట్లో జయాపజయాలను నిర్ణయించాల్సింది జట్టు సభ్యులు మాత్రమేనని, క్రికెట్ పాలకుల చేతుల్లో ఏమీ ఉండదన్నాడు. 


మరోవైపు వన్డే ప్రపంచ కప్ 2023లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి అంతర్జాతీయంగా టీ20 మ్యాచ్ లు ఆడకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం.


 .