Gill Top Rank In Odis: టాప్ ర్యాంకులోనే గిల్.. కోహ్లీకి మెరుగైన స్థానం.. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్
కివీస్ తో పోరును తేలిగ్గా తీసుకోవద్దని రాజ్ పూత్ హెచ్చరించాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. గ్రూపులో అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. సెమీస్ కు ముందు సన్నద్ధతను ఉపకరిస్తుందని తెలిపాడు.
ICC Latest Odi Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో నెం.1 బ్యాటర్ గా తన ప్రస్థానాన్ని భారత ప్లేయర్ శుభమాన్ గిల్ మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఈ వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో అజేయ సెంచరీ (101 నాటౌట్), పాక్ తో 46 పరుగులతో రాణించాడు. దీంతో తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్స్ లో గిల్.. తన ర్యాంకింగ్స్ లో మరో 21 పాయింట్ల పెరుగుదల కనిపించింది. రెండో స్థానంలో ఉన్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు గిల్ కు మధ్య అంతరం 47 పాయింట్లకు పెరిగింది. రోహిత్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక పాక్ తో మ్యాచ్ లో అజేయ సెంచరీ చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. తాజా ప్రదర్శనతో న్యూజిలాండ్ బ్యాటర్ వెనక్కి నెట్టి, నె.5 ర్యాంకును దక్కించుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా తన ర్యాంకు మెరుగు పర్చుకున్నాడు. నె.15 ర్యాంకును దక్కించుకున్నాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ తన నెం.1 ర్యాంకును పటిష్టం చేసుకుంది.
భారత్ ఫియర్ లెస్ గా ఆడుతోంది..
మెగాటోర్నీలో భారత్ ఫియర్ లెస్ గా ఆడుతోందని మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్ పుత్ పేర్కొన్నాడు. ఐసీసీలాంటి టోర్నీలో ప్రత్యర్థిక ఎలాంటి అవకాశమివ్వకుండా చెలరేగుతోందని ప్రశంసించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడని, ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేస్తే తిరుగుండదని పేర్కొన్నాడు. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్న భారత్ దే మెగా టోర్నీ అని జోస్యం చెప్పాడు. అన్నిరంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా.. మిగతా జట్లకు అందనంత ఎత్తులో ఉందని వ్యాఖ్యానించాడు.
కివీస్ తో భద్రం..
ఇప్పటికే రెండు గ్రూపు మ్యాచ్ లు గెలిచి సెమీస్ చేరిన భారత్.. ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆదివారం (మార్చి 2న) తలపడుతుంది. అయితే కివీస్ తో పోరును తేలిగ్గా తీసుకోవద్దని రాజ్ పూత్ హెచ్చరించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు.. గ్రూపులో అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాడు. సెమీస్ కు ముందు అన్ని రంగాల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపాడు. మెగాటోర్నీలో ఇప్పటివరకు భారత్ రెండుసార్లు సాధించింది. 2002, 2013లో చాంపియన్ గా నిలిచిన జట్టు, 2017లో పాక్ చేతిలో ఓడి, రన్నరప్ గా నిలిచింది. అయితే ఈనెల 23 న జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్ పై అలవోక విజయం సాధించి, ప్రతీకారం తీర్చుకుంది. హైబ్రీడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలోని మిగతా లీగ్ మ్యాచ్ లు పాక్ లో జరుగుతుండగా, ఇండియా ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతున్నాయి. మంగళవారం తొలి సెమీ ఫైనల్లో భారత్ ఆడనుంది.