Ind Vs Pak 2025: హైబ్రీడ్ మోడల్ భారత్ అడ్వాంటేజే.. అయితే ఆ లాభం లేదు కదా.. మాజీ క్రికెటర్ విశ్లేషణ
బ్రెజిల్, అర్జెంటీనా మ్యాచ్ లు ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తుందని, దాని నుంచి స్ఫూర్తి పొంది ఐసీసీ ఇలా చేస్తుండవచ్చు అని ఆకాశ్ తెలిపాడు. టోర్నీలో దాయాదుల పోరుతో పైసా వసూల్ అవుతుందని తెలిపాడు.

ICC Cahmpionst Trophy 2025 Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడల్లో జరుగుతుండటంతో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి. అయితే ఈ విధానం వల్ల భారత్ కు అడ్వాంటేజీ ఉందన్న విదేశీ ప్లేయర్ల విమర్శలపై తాజాగా మాజీ క్రికెటర్ కమ్ కామేంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. దుబాయ్ లోని ఒక్క వెన్యూలోనే మొత్తం మ్యాచ్ లు ఆడటం వల్ల ఇండియాకు కచ్చితంగా అడ్వాంటేజీ అని, అయితే అందులో కూడా ఒక ప్రాబ్లం ఉందని పేర్కొన్నాడు. ఇక టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, మిగతా ఏడు జట్లు పాక్ లోని రావాల్పిండి, కరాచీ, లాహోర్ లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీనికి తోడు పాక్, న్యూజిలాండ్, బంగ్లా జట్లు దుబాయ్ లో మ్యాచ్ ఆడతనున్నాయి. ఇన్ని వేదికల్లో ఆడటం వల్ల ఆ జట్లకు కాస్త ఇబ్బందేనని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, భద్రతా కారణాలతో పాక్ లో పర్యటించక పోవడం వల్ల ఇండియాకు అడ్వాంటేజీ వచ్చిందని తెలిపాడు.
ఆ ప్రయోజనం లేదు కదా..?
ఇండియా దుబాయలో ఆడుతున్నప్పటికీ, హోమ్ అడ్వాంటేజీ లేదు కదా అని ఆకాశ్ తెలిపాడు. అక్కడి పిచ్ రూపకల్పనలో భారత పాత్ర ఏమీ ఉండబోదని సూచించాడు. దుబాయ్ కూడా పాక్ ఆధీనంలో ఉంటుందని, అక్కడి పిచ్, స్టేడియం అన్ని విషయాలు పాక్ కంట్రోల్లోనే ఉంటాయని పేర్కొన్నాడు. ఇక పదే పదే భారత్, పాక్ మ్యాచ్ లను ఒకే గ్రూపులో ఐసీసీ టోర్నీల్లో ఆడించడం వెనకాల మర్మాన్ని తెలిపాడు. ఈ మ్యాచ్ ల వల్ల కనకవర్షం కురుస్తుందని, అందుకే కచ్చితంగా ఈ రెండుజట్ల మధ్య మ్యాచ్ ఉండేలా ఐసీసీ జాగ్రత్తలు తీసుకుంటుందని వ్యాఖ్యానించాడు. ఫుట్ బాల్ లో బ్రెజిల్ వర్సెస్ అర్జెంటీనా పోరుతో దాయాదుల పోరును పోల్చాడు.
ఫిఫా టోర్నీలో...
అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ఏర్పాటు చేసే మ్యాచ్ ల్లో కచ్చితంగా బ్రెజిల్, అర్జెంటీనా మ్యాచ్ లు ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తుందని, దాని నుంచి స్ఫూర్తి పొంది ఐసీసీ ఇలా చేస్తుండవచ్చు అని ఆకాశ్ తెలిపాడు. టోర్నీ ఆరంభంలోనే దాయాదుల పోరును ఏర్పాటు చేయడం వల్ల కచ్చితంగా పైసా వసూల్ అవుతుందని తెలిపాడు. ఈ మ్యాచ్ కు ఎంత రేట్ పెట్టినా, టికెట్లు కొనుగోలు చేస్తారని, టీవీల్లోనూ విరగబడి చూస్తారని తెలిపాడు. తాజా మెగాటోర్నీలో కూడా బారత్, పాక్ పోరు విజయవంతమైంది. ఈ మ్యాచ్ ను స్టేడియంలో వేలాది మంది చూడగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. అయితే టోర్నీలో భారత్ సెమీస్ కు వెళ్లగా, పాక్ ఇంటిముఖం పట్టింది. దీంతో మరోసారి దాయాదుల పోరును అభిమానులు మిస్సవబోతున్నారు. ఇక మెగాటోర్నీలో తదుపరి లీగ్ మ్యాచ్ ను మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 4 నుంచి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
Read Also; WPL Table Topper DC: టాప్ లేపిన ఢిల్లీ.. గుజరాత్ పై అలవోక విజయం.. జొనసెన్ మెరుపు ఫిఫ్టీ