KL Rahul Shreyas Iyer: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు శుభవార్త వినిపించింది. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సోమవారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ విధంగా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ చాలా కాలం తర్వాత మైదానంలో కనిపించారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు మైదానానికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తిరిగి మ్యాచ్ ఆడటం ప్రారంభించారు.


కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్‌లో ఆడతారా?
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో చేర్చుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా ఫిట్‌గా ఉంటే కచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉంది.


ఆసియా కప్ 2023 షెడ్యూల్ కూడా ఇటీవలే విడుదల అయింది. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఆగస్టు 30వ తేదీన పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. టీమిండియా మాత్రం పాకిస్తాన్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన రెండో లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 4వ తేదీన భారత్, నేపాల్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.


ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఏమిటి?
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన జరగనుంది. గతసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈసారి మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6, 9, 10, 12, 14, 15వ తేదీల్లో జరుగుతాయి.


ఆసియా కప్ మ్యాచ్‌లను ఎలా చూడాలి?
2023 ఆసియా కప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో క్రికెట్ అభిమానులు ఆసియా కప్‌ను లైవ్ చూడగలరు. ఆన్‌లైన్‌లో చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం అవుతుంది. అలాగే భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ స్పోర్ట్స్‌ ఛానెల్లో కూడా ఎంజాయ్ చేయవచ్చు.


ఆసియా కప్ మ్యాచ్‌ల శాటిలైట్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. ఈ విధంగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు భారతీయ అభిమానులు డీడీ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఆసియా కప్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.


ఆసియా కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు ప్రపంచకప్‌లో కూడా తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో అక్టోబర్ 14వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. మొదట ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 15వ తేదీన షెడ్యూల్ చేశారు. కానీ నవరాత్రి వేడుకల కోసం ఒక రోజు ముందుకు ప్రీ పోన్ చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది.