అసలేం జరిగిందంటే...
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో మూడో రోజు కోచ్ జాసన్ గిల్లెస్పీతో షాన్ మసూద్ గొడవకు దిగడంతో డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కింది. పాకిస్తాన్ సిరీస్‌కు కొత్త ప్రధాన కోచ్‌గా జాసన్ గిలెస్పీ నియమితుడయ్యాడు. డ్రెస్సింగ్ రూంలో గిలెస్పీతో షాన్ మసూద్ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది పాకిస్థాన్ క్రికెట్‌లో పెను ప్రకంపనలు రేపుతోంది. కెప్టెన్ షాన్ మసూద్ పాక్ జట్టు ప్రదర్శనపై మండిపడడం.. కొత్త ప్రధాన కోచ్‌తో వాదించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పాక్ కెప్టెన్ అంతా ఆగ్రహంగా ఉండడానికి స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌తో విభేదాలే కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. పాక్ జట్టు ప్రదర్శన పట్ల కెప్టెన్ షాన్ మసూద్ కోపంతో ఊగిపోతూ గిల్లెస్పీపై ఆ కోపాన్ని చూపించడం సంచలనంగా మారింది. ఆసలు ఈ గొడవకు దారితీసిన ఘటన ఏమిటో స్పష్టంగా తెలియదు
సోషల్ మీడియాలో విమర్శల వర్షంపాకిస్థాన్ డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ షాన్ మసూద్.. హెడ్ కోచ్ గిల్లెస్పీ మధ్య జరిగిన వాగ్వాదంతో పాక్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ డ్రెస్సింగ్ రూం గొడవలతోనే పాక్ క్రికెట్ ఆటతీరు నానాటికి తీసికట్టుగా మారిపోతుందని మండిపడుతున్నారు. ‘బాబర్ కెప్టెన్సీని వదులుకోలేడు’అంటూ కొందరు పాక్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ జట్టులో లుకలుకలకు బాబర్ ఆజమే కారణమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ ఘోర ప్రదర్శన తర్వాతే గిల్లెస్పీ, షాన్ మసూద్ మధ్య పోరాటం జరిగిందని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ సులువైన క్యాచ్‌లను వదలడంతోనే పాకిస్థాన్... బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓడిపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మసూద్ కెప్టెన్సీని బాబర్ దెబ్బతీస్తున్నాడని, కెప్టెన్‌కు కోపం తెప్పించేలా వ్యవహరిస్తున్నాడని అభిమానులు పేర్కొన్నారు.
Also Read: PAK vs BAN: పాక్ గడ్డపై బంగ్లా కొత్త చరిత్ర- పాపం పాక్ అనేలా, బంగ్లా గెలుపు