Shamis Ex Wife Controversial Comments: భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో బాధలను భరిస్తూ షమీ చేసిన ఈ అద్భుత ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే తాజాగా షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌..మరోసారి  ఈ పేసర్‌పై విమర్శలు గుప్పించారు. ఓ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన హసీన్‌ జహాన్‌.. షమీని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. షమీది డర్టీ మైండ్ అని.. అతడు చేసిన తప్పులకు దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను సరిదిద్దుకోవడానికి షమీకి దేవుడి శిక్ష అవసరమని కూడా జహాన్‌ వ్యాఖ్యానించారు. తాను ప్రపంచ కప్ ఫైనల్‌ను చూడలేదని, తనకు మ్యాచ్‌పై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. 


అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం మాత్రం మంచి మనసున్నోళ్లదేనని షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌.. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంటే మంచి మనసున్న ఆస్ట్రేలియానే విజయం వరించిందని అర్థం వచ్చేలా షమీ మాజీ భార్య పోస్ట్‌ పెట్టింది. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం అనంతరం హసీన్‌ జహాన్‌ ఈ పోస్ట్‌ చేసింది. షమీతో పాటు టీమిండియాను ఉద్దేశించే ఆమె ఇలా చేసిందని అభిమానులు మండిపడ్డారు. ఆమె కెమెరా వైపునకు చూస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో చివరికి విజయం వరించేది మంచి మనసున్నోళ్లకే అని ఆడియో వినిపించింది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఆమె ‘అల్లాహు అక్బర్‌’ అని కూడా రాసుకొచ్చింది. దీనిపై క్రికెట్‌ అభిమానులు భగ్గుమన్నారు. ఇప్పటికే చాలా బాధలో కూరుకుపోయిన సమయంలో ఇలాంటి పోస్ట్‌ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే దీనిపై స్పందించిన జహాన్‌... తాను అసలు ఫైనల్‌ మ్యాచ్‌ చూడలేదని.. కాబట్టి ఆ పోస్ట్‌ నేను మ్యాచ్‌ గురించి పెట్టలేదని స్పష్టం చేశారు.


షమీ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని కూడా ఈ ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలో హసిన్ జహాన్ తెలిపారు. షమీ చేసిన తప్పులు, దురాశ, వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా షమీ దగ్గర చాలా డబ్బు ఉందని, దాని ద్వారా తన ప్రతికూల అంశాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా చాలా విమర్శలు వచ్చాయి. 


షమీకి వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ జహాన్ ఆరోపించారు. 2018 మార్చి 7న ఆమె విడుదల చేసిన స్క్రీన్‌షాట్లు సంచలం అయ్యాయి. హసీన్ ఆరోపణలను షమీ ఖండించారు. కెరీర్ ను నాశనం చేయటానికే తన భార్య కుట్ర పన్నిందని ఆరోపించాడు. షమీపై హసీన్ జహాన్ లైంగిక వేధింపులు, గృహహింస ఆరోపణలు చేసింది. షమీకి నాన్ బెయిల్‌బుల్ ఛార్జీలను విధించారు. తనను షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించారని ఆరోపించింది. తాను ఉత్తరప్రదేశ్‌లోని పుట్టింటికి ఎప్పుడు వెళ్లినా హింసించే వారని ఫిర్యాదులో పేర్కొంది. కావాలంటే షమీ ఇరుగుపొరుగువారినైనా అడగండని తెలిపింది. అలాగే షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను పెండింగ్‌ పెట్టింది. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి కొనసాగించింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply