Sarfaraz Earns India Test Recall:  భార‌త టెస్టు బ్యాట‌ర్ సాయి సుదర్శ‌న్ గాయ‌ప‌డ‌టం మ‌రో యువ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కు క‌లిసొచ్చింది.  "నేను ఫిట్ కాకపోవచ్చు, కానీ నాకున్న దాంతో శాయశక్తులా పోరాడతా" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిరోజులకే సర్ఫరాజ్ ఖాన్ లక్ రివర్స్ అయింది. కాలి బొటనవేలి గాయంతో సాయి సుదర్శన్ లంక టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో సర్ఫరాజ్‌కు రెండేళ్ల తర్వాత టీమ్ ఇండియా నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన కోసం అతడు కఠినంగా శ్రమించాడు.

Continues below advertisement

Continues below advertisement

17 కేజీల వెయిట్ లాస్.. కశ్మీర్ లో స్పెషల్ ప్రాక్టీస్ఇంటర్నేషనల్ క్రికెట్ కు బాడీ టైప్ సరిపోదనే విమర్శలను తుడిచేస్తూ గడిచిన ఏడాదిన్నర కాలంలో సర్ఫరాజ్ ఏకంగా 17 కేజీల బరువు తగ్గాడు. ముంబైలో వర్షాల కారణంగా ప్రాక్టీస్ ఆగిపోవడంతో కశ్మీర్ లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియానికి వెళ్లి ట్రెయినింగ్ తీసుకున్నాడు. 2024 లో న్యూజిలాండ్ సిరీస్ లో ఫెయిల్ అయ్యాడని టీమ్ నుంచి తీసేసినా, ఇంగ్లాండ్ టూర్ లో ఇండియా-ఎ తరఫున 92 రన్స్, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

స్పిన్ ఆడే విధానంలో ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ బెస్ట్సెలెక్షన్ కమిటీ ముందు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ ల పేర్లు ఉన్నా స్పిన్ ని అద్భుతంగా ఆడే సర్ఫరాజ్‌ వైపే మొగ్గు చూపారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ల తర్వాత ఈ స్క్వాడ్ లో స్పిన్నర్లను బాగా ఫేస్ చేసే ఎబిలిటీ సర్ఫరాజ్ కి ఉంది. ధ్రువ్ జురెల్ ప్రెజెంట్ ఆఫ్ స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. లంకతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ జురెల్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ లో తక్కువ రన్స్‌కే అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ దగ్గర స్వీప్, రివర్స్ స్వీప్ లాంటి వెరైటీ షాట్స్ ఉండటం బిగ్ ప్లస్ పాయింట్.

ఎమ్‌సిఏ ఇన్ డోర్ లో రెడ్ సాయిల్ ట్రాక్స్ పై ప్రాక్టీస్ఐపీఎల్ తర్వాత ముంబై టి20 లీగ్ లో ఆకాశ్‌ టైగర్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్, ఆ తర్వాత కూర్లా లోని ప్రైవేట్ ఫెసిలిటీస్ లో రెడ్ సాయిల్ ట్రాక్స్ పై గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రభాత్ జయసూర్య నేతృత్వంలోని లంక స్పిన్ విభాగాన్ని ఎదుర్కొనేందుకు సర్ఫరాజ్ కంప్లీట్ గా రెడీ అయ్యాడని తెలుస్తోంది.