Sarfaraz Khan Recalled For Sri Lanka Tests Series: మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ క్రికెట్ లోకి బిగ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. అజిత్ అగార్కర్ లీడర్‌షిప్ లోని సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ సిరీస్ కోసం గాయపడిన బి సాయి సుదర్శన్ రీప్లేస్‌మెంట్ గా సర్ఫరాజ్‌ను సెలెక్ట్ చేసింది. 2024 లో ఇండియా తరఫున లాస్ట్ టెస్ట్ ఆడిన సర్ఫరాజ్, ఆ తర్వాత మంచి పర్ఫార్మన్స్ ఇచ్చినా టీమ్ లో ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. ప్రెజెంట్ లంక టెస్టులకు ఎంపికవ్వడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి ప్లేయింగ్ ఎలెవన్ సెలెక్షన్ విషయంలో కొత్త హెడేక్ తెచ్చిపెట్టింది.

Continues below advertisement

Continues below advertisement

నంబర్ 3 పొజిషన్ పోటీ.. పడిక్కల్ సూపర్ సెంచరీసాయి సుదర్శన్ ఆడే నంబర్ 3 పొజిషన్ లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ దక్కడం కష్టమే. గంభీర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయడం లేదా వార్మప్ మ్యాచ్ లో మైండ్ బ్లాకింగ్ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్‌ను నంబర్ 3 లో దింపే ఛాన్స్ ఉంది. వార్మప్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పడిక్కల్, సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ నంబర్ 3 లో బ్యాటింగ్ చేశారు. సర్ఫరాజ్ తన 6 టెస్ట్ మ్యాచ్ ల కేరియర్ లో నంబర్ 5, 6 స్థానాల్లోనే ఎక్కువగా ఆడాడు. బెంగళూరులో న్యూజిలాండ్ పై నంబర్ 4 లో ఆడి తన ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు.

లంకతో ఫస్ట్ టెస్ట్.. ప్రొబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్గాలే వేదికగా జరగబోయే సిరీస్ ఓపెనర్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. నంబర్ 3 లో పడిక్కల్, నంబర్ 4 లో కెప్టెన్ గిల్ ఆడనున్నారు. నంబర్ 5 లో రిషభ్ పంత్  వికెట్ కీపర్ బ్యాటర్ గా రానున్నాడు. నంబర్ 6 లో ప్రైమరీ స్పిన్ ఆల్‌రౌండర్ గా రవీంద్ర జడేజా, నంబర్ 7 లో మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. జడేజా, కుల్దీప్ ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్  జైన్ కి ప్రయారిటీ ఎక్కువ ఉంది.

స్పిన్ విభాగానికి కుల్దీప్ లీడ్.. పేస్ త్రయంతో బరిలోకిస్పిన్ డిపార్ట్‌మెంట్‌ను కుల్దీప్ యాదవ్ లీడ్ చేయనుండగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లతో ఇండియా ముగ్గురు పేసర్లను రంగంలోకి దించనుంది. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ డెబ్యూ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. లేక‌పోతే స‌ర్ప్రైజ్ లాగా న‌బీని ఆడించ‌వ‌చ్చు.