Sanju Samson On Rohit Sharma World Cup Advice: టీ20 వరల్డ్ కప్ 2026  ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలుత త‌న‌ను తీసేసిన  తర్వాత రోహిత్ శర్మ ఇచ్చిన రీయాస్యూరెన్స్  ను ఫస్ట్ అసలు నమ్మలేకపోయానని ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓపెన్ గా చెప్పాడు. న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత మానసికంగా ఫుల్ గా అలసిపోయానని, ఆ టైమ్‌లో రోహిత్ చూపించిన విజన్ ను తాను అర్థం చేసుకోలేకపోయానని గుర్తుచేసుకున్నాడు. "నిజం చెప్పాలంటే ఆ టైమ్‌లో నేను రోహిత్ మాటలను నమ్మలేదు, అత‌నికి సారీ. అతను ఎక్స్‌పీరియన్స్ తో లేదా మనస్ఫూర్తిగా చెప్పి ఉండొచ్చు. కానీ ఆ రోజు అతను చూసిన ఫ్యూచర్ ను నేను చూడలేకపోయా. నా ఫేస్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది" అని తాజా ఇంటర్వ్యూలో శాంసన్ వెల్లడించాడు.

Continues below advertisement

Read Also: Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!

మైండ్‌సెట్  చేంజ్.. బాటమ్ నుంచి మళ్లీ పైకి లేచిన శాంసన్రిజెక్షన్ వల్ల వచ్చిన డిసప్పాయింట్మెంట్ నుంచి కోలుకోవడానికి తనకు నాలుగైదు రోజుల టైమ్ పట్టిందని సంజూ శాంసన్ అన్నాడు. "ఒకసారి ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అని ఆలోచించా. మనం బాటమ్ లో ఉన్నాం, ఇక్కడి నుంచి పైకి మాత్రమే వెళ్లగలమని డిసైడ్ అయ్యా. సెల్ఫ్-రిఫ్లెక్షన్ స్టార్ట్ చేసి, అసలు క్రికెట్ ఎందుకు ఆడుతున్నా, నా పర్పస్ ఏంటి అని క్వశ్చన్స్ వేసుకున్నా. వరల్డ్ కప్ జరుగుతున్న టైమ్‌లోనే నన్ను నేను రీడిస్కవర్ చేసుకున్నా. దాంతో మైండ్ సెట్ మళ్లీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది" అని కేరళ బ్యాటర్ తెలిపాడు.

Continues below advertisement

Read Also: Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్! 

విండీస్ మ్యాచ్ లో క్లాసిక్ ఇన్నింగ్స్.. గేమ్ నన్ను గైడ్ చేసిందిఈ నయా పర్స్పెక్టివ్ తోనే వెస్ట్ ఇండీస్ తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. పవర్ ప్లే తర్వాత ఫిఫ్త్ గేర్ లోకి వెళ్లడం తన నాచురల్ స్టైల్ అని, కానీ వికెట్లు పడుతున్న టైమ్‌లో విండీస్ పై సిట్యుయేషన్ కి తగ్గట్లే ఆడానని వివరించాడు. "నేను ఎటాక్ చేద్దాం అనుకున్న ప్రతీసారి అదర్ ఎండ్ లో వికెట్ పడేది. అప్పుడే అర్థమైంది గేమ్ కంటే బిగ్ టీచర్ ఏదీ లేదని. గ్రౌండ్ లో గేమ్ మనకు ఏం చేయాలో చెప్తుంది" అని సంజూ స్పష్టం చేశాడు.

దేవుడికి థ్యాంక్స్ చెప్పిన సంజూ.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎమోషనల్ మూమెంట్మ్యాచ్ ముగిసిన తర్వాత చేసిన ఎమోషనల్ సెలెబ్రేషన్ పై స్పందిస్తూ.. "అదొక ప్రైవేట్ సెలెబ్రేషన్, కానీ పబ్లిక్ గా వైరల్ అయింది. నేను గాడ్ ను బాగా నమ్ముతా, ఆ ఇన్నింగ్స్ నేను ఆడింది కాదు. నా ద్వారా జరిగింది, టీమ్ కి హెల్ప్ అయినందుకు చాలా థ్యాంక్స్. కొన్ని షాట్లు చూసి నేనే షాక్ అయ్యా, ఇలా ఎలా కొట్టా అనిపించింది. నా లాస్ట్ శ్వాస వరకు ఈ స్పెషల్ మూమెంట్ గుర్తుండిపోతుంది" అని శాంసన్ స్పష్టం చేశాడు.