Tilak Varma Clarifies Strike Rate Critics:  జింబాబ్వేతో గురువారం జరగబోయే ఫస్ట్ టి20 మ్యాచ్ కి ముందు ఇండియా టి20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో ఇండియా వైఫల్యంపై మాట్లాడిన తిలక్, సిట్యుయేషన్స్ ని బట్టే తాను బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. పవర్ ప్లే లోనే ఫోర్ లేదా ఫైవ్ వికెట్లు పడిపోతున్నప్పుడు క్రీజులోకి వెళ్లి మొదటి బాల్ నుంచే షాట్లు కొట్టి అవుట్ అవ్వడం సరైన ఐడియా కాదని క్లియర్ గా వివరించాడు. వైస్ కెప్టెన్ గా తనకు బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, మేనేజ్మెంట్ చెప్పిన రోల్ కు తగ్గట్లే ఆడుతానని స్పష్టం చేశాడు.

Continues below advertisement

Continues below advertisement

ఆసియా కండిషన్స్ నుంచి ఓవర్సీస్ కు షిఫ్ట్.. ఇంగ్లాండ్ టూర్ లో ఎదురైన ప్రాబ్లమ్స్గత టూ ఇయర్స్ గా ఇండియా ఎక్కువగా ఆసియా కండిషన్స్ లోనే ఆడిందని, సడన్ గా యుకే, ఐర్లాండ్ కండిషన్స్ లో ఆడటం వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైందని తిలక్ చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని సక్సెస్ ఫుల్ టీమ్ పై ఎక్స్‌పెక్టేషన్స్ సహజమని, అయితే ఇంగ్లాండ్ వరల్డ్ క్లాస్ టీమ్ అవ్వడం వల్ల ఛాలెంజెస్ ఎక్కువయ్యాయని తెలిపాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ కి ఇది బిగ్ టూర్ కావడం విశేషం. లాస్ట్ టి 20 మ్యాచ్ లో సౌతాంప్టన్ లో తాను 25 బంతుల్లోనే 53 రన్స్ సాధించిన విషయాన్ని కూడా తిలక్ గుర్తుచేశాడు.

Read Also: Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!

 పిచ్ , కండిషన్స్ పై వైభవ్ తో డిస్కషన్జింబాబ్వే టీమ్ ను తక్కువ అంచనా వేయ డానికి వీల్లేదని, గత ఇయర్ సిరీస్ స్టార్టింగ్ లో వాళ్లు ఫస్ట్ మ్యాచ్ గెలిచారని తిలక్ గుర్తుచేశాడు. ఈసారి ఇండియా కంప్లీట్ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ తో బరిలోకి దిగుతోందని అన్నాడు. ఇక్కడి కండిషన్స్, పిచ్ ల ప్రవర్తన గురించి యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ లాంటి వారితో డిస్కస్ చేసినట్లు తెలిపాడు. లార్జ్ గ్రౌండ్స్, విండీ కండిషన్స్ ఉన్నప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు ఆడిన ఎక్స్ పీరియన్స్ ఇక్కడ అడ్వాంటేజ్ గా మారుతుందని స్పష్టం చేశాడు.