New Year 2023 Wishes: టీమిండియా క్రికెటర్లు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్యాట్ తో బంతిని పదే పదే కొడుతున్న వీడియోను షేర్ చేస్తూ న్యూఇయర్ విషెస్ తెలియజేశారు. ఆ పోస్టుకు నాక్.. నాక్.. అక్కడ ఎవరున్నారు? ఇది 2023. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ట్వీట్ చేశారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య న్యూఇయర్ విషెస్ తో ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ 2023ను గొప్పగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సురక్షితంగా వేడుకలు చేసుకోవాలని అన్నారు.
అలాగే మిగతా భారత ఆటగాళ్లు, మాజీలు తమ ప్రియమైన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ షమీ, పుజారా, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తదితరులు తమ విషెస్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.