Daughters Day 2022:  నేడు కుమార్తెల దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ లెెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కూతురు సారాకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తెతో, పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న అందమైన ఫొటోను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలను కుమార్తెల దినోత్సవంగా జరుపుకుంటారు. భారత్ లో సెప్టెంబర్ నెల నాలుగో వారంలో డాటర్స్ డేను జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 25న కుమార్తెల దినోత్సవంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ కూతుర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా తన కుమార్తె సారాకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన ఫొటోను పంచుకున్నారు. తన కుమార్తె, పెంపుడు కుక్కలతో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. అందులో తండ్రీకూతుర్లిద్దరూ ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అలానే ఆ ఫొటోకు అందమైన వ్యాఖ్యను జోడించారు. 


నువ్వు నా ఒడిలో ఒదిగిపోలేనంతగా ఎదిగిపోయావు. కానీ నా హృదయాన్ని ఎప్పటికీ అధిగమించలేవు. మనం కలిసి పంచుకున్న అద్భుత క్షణాలను, సమయాలను ఈరోజు నాకు గుర్తుచేస్తుంది. వాటిని నేను చాలా ఆస్వాదించాను. కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు సారా అంటూ సచిన్ వ్యాఖ్యానించారు. క్షణాల్లోనే ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సచిన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను 36 మిలియన్లకు పైగా అనుసరిస్తున్నారు. గంట క్రితం షేర్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటికే 3.91 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇకపోతే సచిన్ ప్రస్తుతం లెజండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు.