Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్

శ్రేయాంక స్థానంలో ఆల్ రౌండ‌ర్ స్నేహ్ రాణాను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలిపింది. స్పిన్ బౌలింగ్ వేయ‌డంతోపాటు, దూకుడుగా ఆడగ‌ల స‌త్తా స్నేహ్ సొంతం. ఆమెను రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది

Continues below advertisement

WPL 2025 Latest Updates: డ‌బ్ల్యూపీఎల్ మూడో సీజ‌న్ ఆరంభ మ్యాచ్ గెలిచి ఊపుమీదున్న డిఫెండింగ్ చాంపియ‌న్స్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు పెద్ద షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ శ్రేయాంక పాటిల్ గాయం కార‌ణంగా టోర్నీ మొత్తానికి దూర‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీ త‌ర‌పున 14 మ్యాచ్ లాడిన శ్రేయాంక‌.. 19 వికెట్ల‌తో స‌త్తా చాటింది. గాయంతో ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మైన‌ట్లు జ‌ట్టు యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆమె స్థానంలో ఆల్ రౌండ‌ర్ స్నేహ్ రాణాను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలిపింది. అటు స్పిన్ బౌలింగ్ వేయ‌డంతోపాటు దూకుడుగా బౌలింగ్ చేయ‌గ‌ల స‌త్తా స్నేహ్ సొంతం. ఆమెను రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్ కు ఆర్సీబీ కొనుగోలు చేసింది. గ‌తేడాది మెగావేలంలో స్నేహ్ రాణాను ఎవ‌రు కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో అన్ సోల్డుగా మిగిలింది. తాజాగా శ్రేయాంక గాయంతో దూర‌మ‌వ‌డంతో టోర్నీ ప్రారంభంలోనే ఆడే అవ‌కాశం ద‌క్కింది. ఈసారి స‌త్తా చాటి త‌న ప్లేస్ ను ప‌ర్మినెంట్ చేసుకోవాల‌న స్నేహ్ భావిస్తోంది. 

Continues below advertisement

తొలి మ్యాచ్ లో గైర్హాజ‌రు..
నిజానికి గ‌త కొంత‌కాలంగా గాయాల‌తో శ్రేయాంక స‌త‌మ‌త‌మవుతోంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ షేర్ చేసిన వీడియోలో శ్రేయాంక పాటిల్ కనిపించింది. కానీ గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆమెకు అవకాశం ల‌భించ‌లేదు. దాంతో శ్రేయాంక పాటిల్ ఆడ‌క‌పోవ‌డంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జ‌రిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రేయాంక పాటిల్ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. త‌న గుండె పగిలిందని,  అయినా కానీ తాను మళ్లీ పుంజుకుంటాననే క్యాప్షన్‌తో ఊయల ఊగుతున్న ఫొటోను పంచుకుంది. 

గ‌తేడాది కీల‌క పాత్ర‌..
లీగ్ చ‌రిత్ర‌లో గతేడాది తొలిసారి ఆర్సీబీ టైటిల్ సాధించింది. ఆ సీజ‌న్ లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో శ్రేయాంక పాటిల్ కీలక పాత్ర పోషించింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లతో ఆర్‌సీబీ విజయంలో కీలకంగా వ్య‌వ‌హ‌రించింది. మహిళల ఆసియా కప్ సమయంలోనూ శ్రేయాంక పాటిల్ వేలి గాయంతో కొన్ని మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకుంది. యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాంక పాటిల్.. ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లకు గాయం కారణంగా గైర్హాజ‌రు అయ్యింది. ఇక తొలి మ్యాచ్ లో గెలిచి జోరుమీదున్న ఆర్సీబీ.. త‌ర్వాత మ్యాచ్ లో గ‌తేడాది ర‌న్న‌ర‌ప్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో ఈనెల 17న త‌ల‌ప‌డ‌నుంది. 

Read Also: Ind Vs Pak High Voltage Match: భారత ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని ఆ జట్టుకు సూచన.. ఆ కారణాలతో టీమిండియాపై కోపంతో..

Continues below advertisement