India Vs Australia News: అభిమాని చేసిన పనికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహానికి లోనయ్యాడు. ఎంత చెప్పినా వినక పోవడంతో ఇదెక్కడి గొడవరా అని వాపోయాడు. తాజాగా ఈ ఘటన మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. బుధవారం భారత ఆటగాళ్లు ఎంసీజీలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటికే కొంతమంది ప్లేయర్లు ప్రాక్టీస్ చేసుకుని, హోటల్ కి వెళ్లిపోగా, మరికొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ నెట్ సమీపానికి వచ్చిన ఓ లేడీ అభిమాని అతడిని ఒక కోరిక కోరింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు తను పెద్ద అభిమానినని, తనను చూడాలని ఉందని గట్టిగా అరుస్తూ చెప్పింది. ఈ మాటలు విన్న రోహిత్.. గిల్ కోసం వెతకగా, అప్పటికే అతను మైదానం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. 






కాస్త ఫ్రస్ట్రేట్ అయిన రోహిత్..
అయితే ఈ విషయాన్ని ఆ లేడీ అభిమానికి కన్వే చేయడానికి రోహిత్ ప్రయత్నించాడు. అయినా కానీ లేడీ అభిమానీ రోహిత్ మాటలు చెవికెక్కించుకోనీకుండా గిల్, గిల్ అంటూ అరిచింది. దీంతో అసహనానికి లోనైన రోహిత్.. కహాసే లవూ (ఎక్కడి నుంచి తీసుకురావాలి) అని కాస్త పైకి అన్నాడు. ప్రాక్టీస్ సెషన్లోలోని ఈ వీడియో ప్రస్తుతం వైరలయ్యింది. భారత అభిమానులు దీన్ని పోస్టు చేస్తున్నారు. 


ఆకట్టుకోలేక పోతున్న యువ బ్యాటర్లు..
మరోవైపు ఈ సిరీస్ లో యువ బ్యాటర్లు శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తేలిపోయారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ తేలిపోతున్నాడు. పెర్త్ లో భారీ సెంచరీ చేసిన జైస్వాల్.. ఆ తర్వాత ఆడిన రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ప్రథమంగా తన వికెటే పడుతోంది. ఇక శుభమాన్ గిల్ తొలి టెస్టులో ఆడలేదు. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాటర్.. ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. రెండో టెస్టులో తనకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేదు. కీలకమైన నెం.3లో ఆడుతున్న గిల్.. వీలైనంత త్వరగా బ్యాట్ ఝుళిపించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.



ఇక డేంజరస్ పంత్.. ఇప్పటివరకు ఈ సిరీస్ లో ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. గత పర్యటనలో దగ్గరుండి సిరీస్ గెలిపించిన పంత్.. ఈ సారి ఆ మ్యాజిక్ ను ప్రదర్శించ లేకపోతున్నాడు. వీలైనంత త్వరగా తను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సింగ్ డే టెస్టులో భారత్ రెండు మార్పులు చేసే అవకాశమున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఓపెనింగ్ లో రోహిత్ ఆడటంతోపాటు పేస్ ఆల్ రౌండర్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దించుతారాని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై టీమ్ మేనేజ్మెంట్ ఏమీ స్పందించడం లేదు. నేరుగా టాస్ వేసేటప్పుడే దీనిపై సమాధానం దొరికే అవకాశముంది. 


Also Read: Ind Vs Aus Test Series: జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్