టీ20 ప్రపంచకప్(T20 World Cup)లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు(Bangalore) వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్(Afghanistan)ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరిన రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కుదురుకుంటే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌నో విమర్శలకులందరికీ చెప్పేశాడు. అఫ్గాన్‌పై విధ్వంసకర సెంచరీతో విమర్శలకు బ్యాట్‌తో సరైన సమాధానం చెప్పాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు మిగిలిన ఏకైక టీ 20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ విశ్వరూపం చూపాడు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్‌కు ఇది ఐదో శతకం. పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని శతకాలు చేసిన తొలి బ్యాటర్ హిట్‌మ్యానే. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు నాలుగు శతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బాబర్ ఆజమ్ మూడు సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు.
సిక్సర్ల రికార్డు..
తన సూపర్ ఇన్నింగ్స్‌లో రోహిత్ 8 సిక్సర్లు బాదాడు. తద్వారా టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. మోర్గాన్.. 86 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ ఖాతాలో 90 సిక్సర్లున్నాయి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో కూడా రోహిత్‌దే అగ్రస్థానం. 151 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. ఇప్పటివరకూ 190 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ 173, ఆరోన్ ఫించ్ 125, క్రిస్ గేల్ 125 సిక్సులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
విరాట్‌ను అధిగమించి
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 1643 పరుగులతో రోహిత్ ఈ ఘనత సాధించాడు. 1570 పరుగులతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు.
నాలుగో అత్యధిక స్కోరు..
ఈ మ్యాచ్‌లో రోహిత్.. 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ 20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. రుతురాజ్ (123), విరాట్ కోహ్లీ (122) లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ నలుగురు కడదాక బ్యాటింగ్ చేసి నాటౌట్‌గానే నిలిచారు.
14 నెలల తర్వాత ఈ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్.. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్‌కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.