Rohit Sharma first player to score 5 T20I centuries: ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టీ20లో  భారత్(Bharat) భారీ స్కోర్ చేసింది. తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ(Rohit Sharma)... మూడో మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. సూపర్ సెంచరీతో టీ 20 ప్రపంచకప్ కు ముందు ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. టీమ్ పీకల్లోతు కష్టాల్లో వున్నప్పుడు రోహిత్ విధ్వంసకర బాటింగ్ తో అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు 69 బంతుల్లో హిట్ మాన్ 11 ఫోర్లు.... 8 సిక్సర్లతో 121 పరుగులు చేసాడు.. కెరీర్ లో మరో చిరస్మరణీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 


అర్ధ శతకంతో మెరిసిన రింకూ సింగ్ 
రోహిత్ కు అండగా నిలిచిన నయా ఫీనిషర్  రింకూ సింగ్ అర్ధ శతకంతో మరోసారి మెరిశాడు.. రింకూ 39 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 190 పరుగులు జోడించారు. రోహిత్ భాద్యతయుత ఇన్నింగ్స్ తో టీమిండియా నిర్ణీత20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న భారత్‌(India) క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గుతున్న నామ‌మాత్ర‌పు మూడో టీ20 మ్యాచులో టీమ్ఇండియా టాస్ గెలిచింది.


టపటపా కూలిన టాపార్డర్ వికెట్లు....
టాస్ గెలిచి బాటింగ్ కి దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే దిమ్మదిరిగే షాకులు తగిలాయి. 18 వికెట్లను తొలి వికెట్ కోల్పోయిన టీం ఇండియా తరువాత వరుసగా వికెట్లు కోల్పోయింది నాలుగు పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ను ఫరీద్ అహ్మద్ ఔట్ చేసాడు. తరువాత ఎదుర్కొన్న  మొదటి బంతికే విరాట్ అవుటయ్యాడు. అటు శివమ్ ధూబే ఒక్క పరుగుకే అవుటయ్యాడు. ఇక  సంజు శామ్సన్ కూడా డక్ ఔట్ అయ్యాడు. దీంతో22 పరుగులకే టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గత రెండు గేమ్‌లతో పోల్చితే ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా మెరుగైన ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. అయితే  ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.  నయా ఫీనిషర్  రింకూ సింగ్ సాయంతో జట్టు స్కోరును ముందుకు నడిపిచాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రోహిత్ తర్వాత భారీ షాట్లు ఆడాడు. రోహిత్ శర్మ తన ఐదవ T20I శతకం సాధించి అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 


గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్‌ ఆఖరి టీ20లో సత్తాచాటాలని చూస్తోంది. ఇప్పటివరకు భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనూ విజయం సాధించని అఫ్గానిస్థాన్‌ తొలిసారి నెగ్గి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్తాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని జట్టు కోరుకుంటోంది. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు తీయ‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.