Rohit Sharma Sixers Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌లకు సాధ్యం కాని అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు హిట్ మ్యాన్. ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టుతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 5 సిక్సర్లు బాదాడు. దాంతో వన్డే కెరీర్‌లో 250 సిక్సర్లకు చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు రోహిత్. ఈ జాబితాలో హిట్ మ్యాన్ తరువాత 229 సిక్సర్లతో ఎంఎస్ ధోనీ భారత్ తరఫున రెండో స్థానంలో, సచిన్ 195 సిక్సర్లు, గంగూలీ 190 సిక్సర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.  

హిట్ మ్యాన్ సిక్సర్ల రికార్డ్..ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు ఈ ఫార్మాట్లో రోహిత్ ఖాతాలో 245 సిక్సర్లున్నాయి. ఓవల్‌లో మంగళవారం జరిగిన వన్డేలో 5వ సిక్సర్ బాదడం ద్వారా 250 వన్డే సిక్సర్స్ బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో రోహిత్‌ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్‌ (31; 54 బంతుల్లో 4x4) అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తూ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాప్ 10 సిక్సర్ల కింగ్స్ వీరే..1. షాహిద్ అఫ్రిది - 3512. క్రిస్ గేల్ - 3313. జయసూర్య - 2704. రోహిత్ శర్మ -  2505. ఎంఎస్ ధోనీ - 2296. ఇయాన్ మోర్గాన్ - 2207. డివిలియర్స్ - 2048. బ్రెండన్ మెకల్లమ్ - 2009. సచిన్ - 19510. గంగూలీ - 190

'5000' ఓపెనింగ్‌ రికార్డు గబ్బర్‌, హిట్‌మ్యాన్‌దే!టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్లో 5000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత రెండో జంటగా ఘనత అందుకుంది. దిగ్గజ ద్వయం సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ తర్వాతి స్థానంలో నిలిచింది. సచిన్‌, గంగూలీ కలిసి 1996- 2007 మధ్య 136 వన్డే ఇన్సింగ్సుల్లోనే 6,609 పరుగులు చేశారు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం. ఆ తరువాత భారత్ తరఫున వన్డేల్లో రోహిత్, ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో 5000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.Also Read: IND vs ENG 1st ODI: సచిన్‌, సౌరవ్‌ తర్వాత '5000' ఓపెనింగ్‌ రికార్డు గబ్బర్‌, హిట్‌మ్యాన్‌దే!Also Read: IND vs ENG 1st ODI: చితక్కొట్టిన హిట్‌మ్యాన్‌! 18.4 ఓవర్లకే టీమ్‌ఇండియా గ్రేట్‌ విక్టరీ