Rohit Sharma VS Gautam Gambhir: ఇటీవల టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి బడిన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత మార్చిలో భారత్ సాధించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ముఖ్యపాత్ర మాజీ కోచ్ రాహుల్ ద్రవిడేదని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తాజాగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుత హెడ్ కోచ్ వరుస వైఫల్యాల తర్వాత సాధించిన అతి పెద్ద టోర్నీ ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కావడం విశేషం. ఆ తర్వాత ఆసియాకప్ లో భారత్ విజయం సాధించింది. అయితే చాంపియన్స్ ట్రోఫీ వెనకాల ద్రవిడ్ కృషి మాత్రమే ఉందని రోహిత్ పేర్కొనడం, గంభీర్ ను కాస్త ఇరుకున పెట్టేదే. తనను కెప్టెన్సీ నుంచి తొలగించడం వెనకాల గంభీర్ హస్తం ఉందని భావించి, హిట్ మ్యాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా..? అనే సందే|హాలు నెలకొన్నాయి.
ప్రణాళికలతోనే..నిజానికి ద్రవిడ్, రోహిత్ ద్యయం సూపర్ హిట్ అయింది. సొంతగడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా ఫైనల్ కు చేరిన టీమిండియా.. తుదిపోరులో ఆసీస్ చేతిలోపరాజయం పాలైంది. అయితే ఆ తర్వాత జట్టు ఏం చేయాలో అనే దానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగామని రోహిత్ తెలిపాడు. చివరి మెట్టుపై బోల్తా పడకుండా ముందుకు సాగడంపై దృష్టి పెట్టి, విభిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యామని తెలిపాడు. ఈక్రమంలో 2024 టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించిందని గుర్తు చేశాడు.
అదే ఒరవడి..ఇక ఇదే మంత్రాన్ని ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాటించి, అజేయంగా నిలిచి కప్పును సాధించినట్లు తెలిపాడు. వరుస విజయాల వెనకాల ఏళ్ల తరబడి కృషి ఉందని, తక్కువ సమయంలో ఇలాంటి ఫలితాలను సాధించలేదని గుర్తు చేశాడు. ఇక రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. సొంతగడ్డపై ఆసీస్ తో తలపడనుండటం సవాలుతో కూడుకున్నదని, భారత్ పై తమ సిసలైన ఆటతీరును ప్రదర్శిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటికే అక్కడికి చాలాసార్లు వెళ్లానని చెప్పిన రోహిత్, అక్కడెలా ఆడాలో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. తనపై చాలా అంచనాలు ఉన్నాయని, వాటిని నిలబెట్టుకోగలిగితే, టీమిండియాకు ఫేవరబుల్ గా రిజల్ట్ వచ్చే అవకాశముందని వ్యాఖ్యానించాడు.
ఇక మూడు ఫార్మాట్లలో అవకాశం దొరికినప్పుడల్లా రాణించడానికి ప్రయత్నించానని, ఇకపై ఇదే ఒరవడిని పాటిస్తానని తెలిపాడు. ఇక ఈనెల 19 నుంచి 3 వన్డేల సిరీస్ ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య జరుగుతుంది. భారత స్టార్లు రోహిత్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో బరిలోకి దిగుతారు. తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూసుకోవాలని ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు.